ధోని కోసం దేవుడి మొక్కిన జీవా.. కానీ?
అయితే ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధించి టాప్ ప్లేస్ లోకి వెళ్తారు అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే మ్యాచ్ కూడా ఎంతో హోరా హోరీ గా మారిపోయింది. ఓవైపు మహేంద్ర సింగ్ ధోనీ.. మరో వైపు ధోని వారసుడిగా పేరన్న రిషబ్ పంత్ ఇక వీరిద్దరూ కెప్టెన్గా నిన్నటి మ్యాచ్ లో తలపడ్డారు. అయితే మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తక్కువ పరుగులు చేయగలిగింది. దీంతో ఢిల్లీ జట్టు ఎంతో సునాయాసంగా విజయం సాధించగలదు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా మారింది. చివరి బంతి వరకు ఎవరు విజయం సాధిస్తారు అన్నది కూడా ఊహకందని విధంగా మారిపోయింది.
అయితే ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో అటు స్టేడియం స్టాండ్ లో ధోని కూతురు జీవ కూర్చుని ఉంది. ఈ క్రమంలోనే మ్యాచ్ చివరి ఓవర్ వరకు రావడంతో ఎవరు గెలుస్తారు అన్నది ప్రేక్షకులందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో స్టాండ్ లో జీవా ధోనీ జట్టు గెలవాలి అంటూ దేవుడిని ప్రార్థించింది. ఇక దీనికి సంబంధించిన ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే నిన్న జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయినప్పటికీ అటు తండ్రి కి సపోర్ట్ గా జీవ దేవునికి మొక్కడం మాత్రం ఎంతో క్యూట్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.