భారత్ కంటే పాక్ గొప్పది.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్?

praveen
భారత్ నుంచి పాకిస్థాన్ వేరుపడిన నుంచి పాకిస్థాన్ భారత్కు దాయాది దేశం లోనే కొనసాగుతూ ఉంది.  ఎప్పుడు ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం తప్ప మితృత్వం లేదు.  అన్ని విషయాల్లోనూ శత్రుత్వమే కొనసాగుతుంది. అయితే ఒకప్పుడు పాకిస్తాన్ శత్రుదేశం అయినప్పటికీ భారత క్రికెటర్లు మాత్రం పాకిస్తాన్ పర్యటనకు వెళ్లే వారు.  కానీ ఆ తర్వాత మాత్రం పాకిస్థాన్ పర్యటనను పూర్తిగా రద్దు చేసుకున్నారూ అనే విషయం తెలిసిందే.  కేవలం వరల్డ్ కప్ లో తప్ప భారత జట్టు పాకిస్థాన్ జట్టుతో ఎప్పుడు ద్వైపాక్షిక ఆడదు.  వరల్డ్ కప్ లో మాత్రం పాకిస్తాన్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అంటే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా కళ్ళార్పకుండా మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు.



 ఇకపోతే ఇక మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ఇక ఈ వరల్డ్ కప్ లో భాగంగా అటు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది.  ఇప్పటికే భారత్ పాకిస్థాన్ పర్యటనను నిలిపి వేయగా అటు మిగతా దేశాలు కూడా పాకిస్థాన్ పర్యటనను నిషేధిస్తూ వస్తున్నాయి. దీంతో ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ లోని మాజీ ఆటగాళ్లు అది కూడా భారత క్రికెట్ బోర్డ్ పై విమర్శలు చేయడం చేస్తున్నారు. ఇలా ఇటీవలి కాలంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు భారత క్రికెట్ జట్టు పై చేసిన విమర్శలు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఇటీవలే మరో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్ చేశాడు.


ఈ కామెంట్స్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్ టీమిండియా జట్టుఫై తన అసూయా బయటపెట్టాడు. భారత జట్టు కంటే పాకిస్థాన్ జట్టు ఎంతో మెరుగైంది. అందుకే పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్ ఆడేందుకు భారత్ ఇష్టపడదు అంటూ చెప్పుకొచ్చాడు అబ్దుల్ రజాక్. ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా భారత్ కంటే పాకిస్థాన్  మెరుగ్గా ఉండేది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. గతంలో పాకిస్తాన్ కి ఇమ్రాన్ ఖాన్ టీమిండియాకు కపిల్ దేవ్ ఉండేవారు.  వీరిద్దరిలో ఇమ్రాన్ ఖాన్ ఎంతో మెరుగైన ఆటగాడు అంటూ అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: