కోహ్లీ ముందు పెద్ద సవాల్.. ఫాన్స్ లో ఉత్కంఠ?
చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన ఫినిషింగ్ ఇవ్వడంతో చివరికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయాన్ని సాధించి తొమ్మిదవ సారీ ఐపీఎల్లో ఫైనల్కు చేరుకుంది. కాగా నేడు రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టిక లో మూడు నాలుగు స్థానాల్లో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ మ్యాచ్ కూడా ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎన్నో సీజన్ల నుంచి కనీసం ఫైనల్ కి కూడా చేరడం లేదు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి.
అదే సమయంలో కోల్కతా నైట్రైడర్స్ జట్టు కూడా వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా అందిపుచ్చుకుని ఫైనల్కు చేరుకోవాలని పదునైన వ్యూహాలతో బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు నిష్క్రమించబోతున్నారూ. ఎవరు ముందుకు సాగపోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. సీజన్ ప్రారంభం నుంచే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎంతో జోరుగా వరుస విజయాలు సాధిస్తోంది. అన్ని విభాగాల్లో కూడా పటిష్టంగా కనిపిస్తుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. దీంతో నేడు జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది?