ఐపీఎల్ ట్రోఫీ కంటే అదే ముఖ్యం.. కోహ్లీ కెప్టెన్సీపై ABD కామెంట్స్?
బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో కూడా జట్టు ఎంతో పటిష్టంగా కనిపించడం.. వరుస విజయాలు సొంతం చేసుకోవడంతో ఇక బెంగళూరు జట్టుకు అందని ద్రాక్షలా ఉన్న ఐపీఎల్ టైటిల్ ఈసారి గెలువబోతుంది అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో నిలిచి ఆఫ్ కి అర్హత సాధించింది. కానీ ఎప్పటిలాగానే చివరి అడుగులో తడబడి చివరికి ఇంటి బాట పట్టింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు చేతిలో ఓడిపోయి ఇంటి బాట పట్టింది. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు అందరూ ఎంతగానో నిరాశలో మునిగిపోయారు.
కోహ్లీ పూర్తిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ ఉండడం అటు అభిమానులకు మరో నిరాశ అని చెప్పాలి. అయితే కోహ్లీ కెప్టెన్సిపై ఇటీవలే ఆర్సీబీ జట్టు కీలక బ్యాట్మెన్ ఎబి డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇన్నాళ్ల పాటు ఆర్సిబి జట్టుకు కెప్టెన్గా కోహ్లీ ఉండడం తమ అదృష్టం అంటూ చెప్పుకొచ్చాడు. కోహ్లీ కెప్టెన్సీలో ప్రతి సంవత్సరం నేను జట్టులో ఆడాను. కోహ్లీ కెప్టెన్సీ ఎప్పుడు ప్రతి ఒక ఆటగాడిగా స్ఫూర్తిదాయకం. ఆటగాడిగా ఒక వ్యక్తిగా నన్ను చాలా ప్రభావితం చేశావ్. నువ్వేంటో నాకు తెలుసు ఆటగాళ్లలో నమ్మకం కలిగేలా చేస్తావ్.. ఐపీఎల్ ట్రోఫీ గెలవడం కంటే అది చాలా ముఖ్యం అంటూ ఎబి డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.