బంగ్లాదేశ్ ముందు 141 పరుగుల లక్ష్యం..

M Manohar
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఈ నెల 15 న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ ముగిసిన తర్వాత ఈ రోజు నుండి  ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ను నిర్వహిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ రోజు ప్రారంభమైన ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ప్రస్తుతం బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్ల మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడిన కారణంగా మొదట బ్యాటింగ్ కు వచ్చిన స్కాట్లాండ్ జట్టుకు బంగ్లా బౌలర్లు మొదట్లోనే షాప్ ఇచ్చారు. స్కాట్లాండ్  కెప్టెన్ కైల్ కోయిట్జర్ ను డక్ ఔట్ గా వెనక్కి పంపించారు. కానీ మరో ఓపెనర్ జార్జ్ మున్సే 29 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ మాథ్యూ క్రాస్ 11 పరుగులు మాత్రమే చేయగా... రిచీ బెర్రింగ్టన్ రెండు పరుగులు చేసాడు. అలాగే కాలమ్ మాక్లీడ్ ఐదు పరుగులు చేస్తే మైఖేల్ లీస్క్ డకౌట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత వచ్చిన క్రిస్ గ్రీవ్స్ (45), మార్క్ వాట్ (22) స్కోర్ బోర్డు ముందుకు నడిపించారు. వీరిరువురు ఏడో వికెట్ కు 51 పరుగులు జోడించడంతో స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 140 పరుగులు చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయింది.

ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో మహేది హసన్ మూడు వికెట్లు తీయగా షకీబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్ రహమాన్ రెండేసి వికెట్లు మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించి క్వాలిఫై లో ముందుకు వెళ్లాలంటే బంగ్లాదేశ్ 141 పరుగులు చేయాలి. అయితే స్కాట్లాండ్ బౌలర్లను ఎదుర్కొని బంగ్లా ఆటగాళ్ళు 20 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించగలరా లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: