టీమిండియాతో పాకిస్తాన్ ఓడితే ఇక అంతే : బ్రాడ్ హాగ్

frame టీమిండియాతో పాకిస్తాన్ ఓడితే ఇక అంతే : బ్రాడ్ హాగ్

praveen
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు అది ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా హై ఓల్టేజ్ మ్యాచ్ భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  ఇక ఈ మ్యాచ్ వస్తుంది అంటే చాలు క్రికెట్ ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోతుంటారు. ఎందుకంటే టీమ్ ఇండియా పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక మ్యాచ్ లు ఎప్పుడూ జరగవు. కేవలం వరల్డ్ కప్ లో మాత్రమే ఈ రెండు జట్లు హోరాహోరీగా తడబడుతూ  ఉంటాయి   అయితే ఈ రెండు జట్లు కూడా చిరకాల ప్రత్యర్థిలుగా కొనసాగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అందుకే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అంటే చాలు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు.

 కాగా టి 20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం రోజున దాయాది జట్లుగా కొనసాగుతున్న టీమ్ ఇండియా పాకిస్థాన్ మధ్య రసవత్తర పోరు జరగబోతుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు  అయితే ప్రస్తుతం టీమిండియా జట్టు ఎంతో దూకుడు మీద ఉంది అని చెప్పాలి. ఇప్పటికే ఐపీఎల్ లో టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఇక ఇటీవల జరిగిన వార్మప్ మ్యాచ్ లలో కూడా విజయం సాధించి పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసంతో ఉంది టీమ్ ఇండియా జట్టు. ఇక మరోవైపు ఇప్పటివరకు ప్రపంచకప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన అన్ని మ్యాచ్ లలో కూడా భారత్ దే ఆధిపత్యం కావడం గమనార్హం.

 ఈ క్రమంలోనే ఈ గణాంకాల ఆధారంగా ఇక ఈ ఆదివారం రోజు జరగబోయే మ్యాచ్ లో కూడా టీమిండియా జట్టు విజయం సాధిస్తుంది అని ప్రస్తుతం భారత అభిమానులు అందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రూప్ 2లో ఉన్న మిగతా జట్లను ను ఓడించి భారత్ సెమీఫైనల్ చేరుతుంది అని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. టి20 ప్రపంచ కప్ లో ఏ జట్లు  సెమీస్ చేరుకుంటాయి అనే విషయంపై స్పందించిన బ్రాడ్ హాగ్ గ్రూప్ 1 నుంచి ఇంగ్లాండ్, వెస్టిండీస్.. గ్రూప్ 2 నుంచి భారత్ పాకిస్తాన్ సెమిస్ చేరుకుంటాయి అంటూ తెలిపాడు. అయితే తొలి మ్యాచ్లో పాకిస్తాన్ టీం ఇండియా చేతిలో ఓటమి పాలైతే ఆ తర్వాత న్యూజిలాండ్ తో గెలవవలసి ఉంటుంది. తొలి మ్యాచ్లోనే ఓడిపోతే ఇక ఆ తర్వాత పాకిస్తాన్ రాణించడం ఎంతో కష్టం అంటూ బ్రాడ్ హాగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: