కోహ్లీ vs బాబర్ : ఊపులో ఉంది ఎవరు...?
అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్ ఇద్దరు మంచి దూకుడు మీద ఉన్నారు. వన్డే టెస్ట్ టీ20 ఫార్మాట్లలో కోహ్లీ యావరేజ్ 50కి పైగా ఉంటే బాబర్ ఆజమ్ ది 40కి పైగా ఉంటుంది. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సమయం నుండి నిలకడైన బ్యాటర్ గా... ఉంటే బాబర్ ఆజమ్ కూడా గత నాలుగేళ్లుగా రాణిస్తున్నాడు.
అయితే విరాట్ కోహ్లీ వన్డేలో 59.07 సగటుకు 12,129 పరుగులు చేయగా టెస్టుల్లో 51.08 సగటుతో 7,765 పరుగులు నమోదు చేశాడు. అలాగే ఈ మ్యాచ్ జరుగుతున్న టీ20 ఫార్మాట్లో కూడా 52.5 సగటుతో 3,159 పరుగులను సాధించాడు. ఇక బాబర్ ఆజమ్ కూడా పాకిస్తాన్ ఓపెనర్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు. వన్డే ఫార్మాట్ లో ఇప్పటివరకు 56.92 సగటుతో 3,985 పరుగులు చేయగా... టెస్ట్ ఫార్మాట్లో 42.94 యావరేజ్ తో 2,326 పరుగులు చేశాడు. ఇక ఈ ప్రపంచ కప్ యొక్క టి20 ఫార్మెట్లో 46.29 తో ఇప్పటివరకు 2,204 పరుగులను నమోదు చేశాడు.
అయితే బాబర్ ఆజమ్ మీ ఏడాది టాప్ లో ఉన్నాడు అని చెప్పుకోవాల్సిందే. 2021 ఏడాదిలో 17 టి20 మ్యాచ్ లు ఆడిన బాబర్ 523 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కానీ విరాట్ కోహ్లీ ఈ ఏడాదిలో పరుగులు చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డారు అనేది అందరికి తెలిసిందే.