దాయాదుల సమరం: చరిత్రలో మొదటిసారి... ఏమిటో తెలిస్తే షాక్?
ఈ రోజు టీ 20 వరల్డ్ కప్ 2021 సూపర్ 12 లో భారత్ తన మొదటి మ్యాచ్ పాకిస్తాన్ తో ఆడనుంది. ఆ మ్యాచ్ ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో మ్యాచ్ గురించి మామూలు సందడి లేదు. ఇది 22 మంది ప్లేయర్ ల మధ్యన జరిగే మ్యాచ్ లా అనిపించడం లేదు. రెండు దేశాలలోని కోట్ల మంది ప్రజలందరి మధ్యన జరిగే మ్యాచ్ లా అనిపిస్తోంది. ఈ రోజు రాత్రి మ్యాచ్ ముగిసే వరకు ఇదే బజ్ కంటిన్యూ అవుతోంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచేది ఇండియానే అని రికార్డులు చెబుతున్నా, పాకిస్తాన్ మాత్రం గెలిచేది మేమే అంటూ హంగామా చేస్తున్నారు.
మరి ఎవరు గెలుస్తారో అన్నది మరి కొన్ని గంటల్లో తెలియనుంది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ కు సంబంధించి ఒక వార్త సంచలనం రేపుతోంది. చరిత్రలో ఇప్పటి వరకు ఈ మ్యాచ్ కు లేని అరుదైన ఘనతను ఈ మ్యాచ్ సొంతం చేసుకోబోతోంది. ఈ మ్యాచ్ భారత్ పాకిస్తాన్ దేశాలతో పాటు మొత్తం 200 దేశాల్లో ప్రసారం కానుంది. అయితే ఈ మ్యాచ్ కు ఏ రేంజ్ లో టీఆర్పీ రానుందో అన్నది చూడాల్సి ఉంది. ఇక మన దేశంలో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ మరియు హాట్స్టార్ లో ప్రత్యక్షముగా వీక్షించవచ్చు.