ఆఫ్ఘన్ పై స్కాట్లాండ్ ప్రతీకారం తీర్చుకుంటుందా?
మొదట టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ బ్యాటింగ్ తీసుకుంది. ఇందుకు కారణం లేకపోలేదు మ్యాచ్ జరుగుతూఛ్న్నది షార్జా లో కాబట్టి ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసే వారికి అనుకూలంగా ఉంటుందని ఐపీఎల్ మ్యాచ్ ల ద్వారా తెలిసింది. అయితే ఈసె విధంగా అనుకుని ఆదివారం మ్యాచ్ లో బంగ్లాదేశ్ మోసపోయింది. ఇక్కడ 171 పరుగులు చేసినా ఆ స్కోర్ ను కాపాడుకోలేక శ్రీలంక చేతిలో ఓటమి పాలయింది. మరి ఈ రోజు ఏమి జరుగనుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే గతంలో ఆఫ్గనిస్తాన్ చేతిలో దారుణమైన రికార్డు స్కాట్లాండ్ కు ఉంది. ఇప్పటి వరకు ఆఫ్గనిస్తాన్ తో స్కాట్లాండ్ ఆడిన 6 మ్యాచ్ లలో ఒక్కటి కూడా గెలిచింది లేదు.
మరి దాదాపు అయిదేళ్ల తర్వాత మళ్ళీ వీరిద్దరూ తలపడుతున్నారు. అన్ని విభాగాలలో స్ట్రాంగ్ గా ఉన్న ఆఫ్ఘన్ జట్టును స్కాట్లాండ్ ఓడించి ప్రతీకారం తీర్చుకుంటుందా? లేదా ఓటముల రికార్డును 7-0 గా మార్చుకుంటుందా అన్నది తెలియాలంటే ఇంకొంతసేపు ఆగాల్సిందే. ఇప్పుడు స్కాట్లాండ్ ఉన్న ఫామ్ లో ఆఫ్ఘన్ ను ఓడించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి క్రికెట్ లో ఏమైనా జరగొచ్చు.