శ్రీలంక సెమీస్ ఆశలు గల్లంతు?
ఓపెనర్ పతుం నిస్సంక మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఫామ్ లో ఉన్న అసలంక మరియు రాజపక్సే లు సైతం నిరాశ పరిచారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో నార్జే , శంశి మరియు ప్రిటోరియస్ లు అధ్బుతమైన బౌలింగ్ కు శ్రీలంక బ్యాట్స్ మాన్ లు విలవిలలాడిపోయారు. ఇక ౧౪౩ పరుగుల లక్ష్యంతో ఛేదన ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ నత్త నడకన సాగింది. ఒక దశలో శ్రీలంక గెలిచేలా అనిపించింది. చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు చేయాల్సిన దశలో సీరీజులో ఉన్న మిల్లర్ మరియు రబాడాలపై తీవ్ర ఒత్తిడి పడింది. కానీ 19 వ ఓవర్ లో ఒక సిక్స్ మరియు ఆఖరి ఓవర్ లో రెండు సిక్స్ లు కొట్టడంతో ఒక బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది సౌత్ ఆఫ్రికా.
అలా వచ్చిన విజయావకాశాన్ని పేలవమైన బౌలింగ్ తో శ్రీలంక దూరం చేసుకుంది. ఈ ఓటమితో ఆడిన మూడు మ్యాచ్ లలో రెండు ఓటమి చెందడంతో ఇక దాదాపుగా సెమీస్ దారులు మూసుకుపోయినట్టే. గ్రూప్ 1 లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇంగ్లండ్ మరియు ఆస్ట్రేలియా లు సెమీస్ కు అర్హత సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి మధ్యలో వీరిద్దరూ ఓడిపోతే తప్పించి ఇక ఈ గ్రూప్ నుండి మాత్రం వేరే సెమీఫైనలిస్ట్ లు అవుతారు అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.