ఐసీసీ టీ 20 ప్రపంచకప్ 2021 లో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ జట్టు నమీబియా జట్టుతో పోటీపడుతోంది. అయితే ప్రపంచ కప్ కోసం నేరుగా క్వాలిఫై అయిన జట్లలో ఆఫ్ఘనిస్తాన్ ఒకటైతే క్వాలిఫైయర్ మ్యాచ్స్ ఆడి వచ్చిన జట్టు నమీబియా. ఇక ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రపంచ కప్ లో రెండు మ్యాచ్లు ఆడారు. అందులో మొదటి మ్యాచ్లో ఘన విజయం సాధించి రెండో మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఇక నమీబియా కేవలం స్కాట్లాండ్ పైన మాత్రమే తలపడి విజయం సాధించింది. అయితే ఈ ప్రస్తుతం రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఏప్రిల్ మొహమ్మద్ నబీ టాస్ లో గెలిచి బ్యాటింగ్ తీసుకొని నమీబియా ను మొదట బౌలింగ్ పంపిస్తున్నాడు. అయితే గత మ్యాచ్లో ఓడిన ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్లో విజయం సాధించాలని ఒక మార్పు చేసారుకోని పోటీకి వస్తుంది. గత మ్యాచ్లో గెలిచిన కారణంగా నమీబియా జట్టు ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న నమీబియా ఇందులో విజయం సాధిస్తే ఆఫ్ఘనిస్తాన్ కిందకు నెట్టివేసి రెండో స్థానం లోకి వెళుతుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది.
నమీబియా : క్రెయిగ్ విలియమ్స్, మైఖేల్ వాన్ లింగెన్, జేన్ గ్రీన్ ( w ), గెర్హార్డ్ ఎరాస్మస్ ( c ), డేవిడ్ వైస్, జెజె స్మిత్, జాన్ ఫ్రైలింక్, పిక్కీ యా ఫ్రాన్స్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్‌మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్
ఆఫ్ఘనిస్తాన్ : హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్( w ), రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, అస్గర్ ఆఫ్ఘన్, మొహమ్మద్ నబీ( c ), గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, కరీం జనత్, హమీద్ హసన్, నవీన్-ఉల్-హక్