టీమిండియా సెమీస్ వెళ్లాలంటే.. ఇదొక్కటే మార్గం?

praveen
ఏంటి టీమ్ ఇండియా గురించి తక్కువ అంచనా వేస్తున్నారా.. ఈసారి కప్పు కొట్టడం పక్క.. టీమిండియా బ్యాటింగ్ విభాగం ఎంతో పటిష్టంగా ఉంది.. బౌలింగ్ విభాగం కూడా ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది.. ఇలాంటి బలమైన జట్టును ఎదుర్కొని అసలు ఏ జట్టు నిలువకలదు? టీమిండియాపై ఏ జట్టు గెలవగలదు?.. టీమిండియా పై విజయం అనేది కలలో మాటలు మాత్రమే.. ఇండియా వరుస విజయాలతో దూసుకుపోవటం పక్క.. సరిగ్గా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాకముందు ప్రతి భారతీయ క్రికెట్ ప్రేక్షకుడు అనుకున్న మాటలు ఇవి. కానీ టీమ్ ఇండియా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది.

 ఇప్పటివరకు ఎన్నడు ఓడని మ్యాచ్ల్లో ఓడి ఇప్పటికే అప్రతిష్ఠ మూట కట్టుకుంది టీమిండియా. టి20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ జట్టుపై టీమ్ ఇండియా ఆడిన మ్యాచ్ లో టీమిండియా ప్రదర్శన కలలో కూడా ఇండియన్ క్రికెట్ ప్రేక్షకులను భయపడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పాకిస్థాన్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిన తర్వాత.. టీమిండియా తప్పక గెలుస్తుంది అనే  భావన నుంచి గెలిస్తే బాగుండు అనే భావనకు వచ్చారు ఇండియన్ ప్రేక్షకులు. ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో మరింత చెత్త ప్రదర్శన చేసిన టీమిండియా. వరల్డ్ క్లాస్ బ్యాట్ మెన్స్ అందరూ కలిసి చేసింది 111 పరుగులే. టీమిండియా సింగిల్స్ తీయడానికి ఇబ్బంది పడితే ప్రత్యర్థి న్యూజిలాండ్ బౌండరీలతో విరుచుకుపడింది.

 దీంతో మరోసారి చిత్తుగా ఓడిపోయింది టీమిండియా.. ఇప్పుడు గెలిస్తే బాగుండు కాదు అసలు టీమిండియా గెలుస్తుందా  అనే భావన ప్రతి ఒక్కరిలో కి వచ్చేస్తుంది. వరల్డ్ కప్ లో టీమిండియాకు సెమీస్ అవకాశాలు గల్లంతయ్యాయి. కానీ ఒక్క అవకాశం మాత్రమే మిగిలి ఉంది. న్యూజిలాండ్ జట్టును ఆఫ్ఘనిస్తాన్ ఓడించాలి.. టీమ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ నమీబియా స్కాట్లాండ్ తో జరిగే మ్యాచ్ లో భారీ తేడాతో విజయం సాధించాలి. న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ కంటే ఇండియా ఎక్కువ రన్రేట్ కలిగి ఉండాలి. ఇదంతా జరగడం అంటే ఒక అద్భుతం అనే చెప్పాలి.. కానీ టీమ్ ఇండియా సెమీస్కు వెళ్లాలంటే ఇదొక్కటే మార్గం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: