టి20 వరల్డ్ కప్.. ఇలా చేసిన జట్లే గెలిచాయ్?
అయితే దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఎందుకు ఇలా ఓటమి పాలు కావాల్సి వస్తుంది అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లను పరిశీలిస్తే అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తోంది. ఇప్పుడు వరకు టి20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్లో తొలుత ఏ జట్టు అయితే బ్యాటింగ్ చేస్తుందో ఆ జట్టు చివరికి ఓటమి పాలు అవ్వడం జరుగుతుంది. ఏ జట్టు తొలుత బౌలింగ్ చేస్తుందో ఇక ఆ జట్టు విజయం ఖాయం గా మారిపోతుంది. ఇప్పటివరకు జరిగిన దాదాపు అన్ని మ్యాచులో కూడా ఇదే జరిగింది అని చెప్పాలి.
ఇప్పటివరకు సూపర్ 12 లో భాగంగా 16 మ్యాచ్లు జరిగాయి. అయితే ఈ పదహారు మ్యాచ్ లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు కేవలం 3 సార్లు మాత్రమే విజయం సాధించడం గమనార్హం అదే సమయంలో తొలుత బౌలింగ్ చేసి ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన జట్టు ఏకంగా 13 సార్లు విజయం సాధించడం గమనార్హం. ఇక అటు టీమిండియా విషయంలో కూడా ఇదే జరిగింది అని చెప్పాలి. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా రెండు సార్లు కూడా టాస్ ఓడి పోయింది. ఇక ఇదే టీమిండియా పాలిట శాపంగా మారి పోయింది. మొదట టాస్ ఓడిపోవడంతో పాకిస్తాన్ జట్టు బౌలింగ్ తీసుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా టాస్ ఓడిపోయిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఓటమిపాలైంది.