విరాట్ కోహ్లీ కీపింగ్ కూడా చేశాడు.. ఎప్పుడో తెలుసా?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ఒకవైపు జట్టు బాధ్యతలను కెప్టెన్గా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరోవైపు జట్టులో కీలక పాత్ర వహిస్తూ మరోవైపు జట్టులో కీలక ఆటగాడిగా కూడా రాణిస్తున్నాడు విరాట్ కోహ్లీ. తన ఆటతో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. విరాట్ కోహ్లీ ఆడే ప్రతి మ్యాచ్ కూడా కోహ్లీ కి అదే చివరి మ్యాచ్ ఏమో అన్నంత కసి తో ఆడుతుంటాడు. అంతేకాదు మైదానంలో కూడా ఎంతో దూకుడుగా కనిపిస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ప్రతి విషయంలో కూడా అగ్ర సేవ్ గానే స్పందిస్తూ తన ఆటిట్యూడ్తో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.


ఇకపోతే విరాట్ కోహ్లీ ఒక్కసారి మైదానంలో కుదురుకున్నాడు అంటే చాలు స్కోర్ బోర్డు పరుగులు పెడుతోంది అనే విషయం తెలిసిందే. ఇప్పుడు వరకు అన్ని ఫార్మాట్లలో కూడా భారీ పరుగులు చేసి ఎంతో మంది క్రికెటర్లు సాధించిన రికార్డులు తక్కువ సమయంలోనే విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు.  అయితే విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ అన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులు చెబుతున్నాయి.


 అయితే ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ మాత్రమే కాదు విరాట్ కోహ్లీ మైదానంలో ఫీల్డర్ లాగా కూడా ఎంతో అదరగొడుతున్నాడు విరాట్ కోహ్లీ. అయితే విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారీగా పరుగులు చేయడం  మైదానంలో మెరుపు ఫీలింగ్ తో ప్రేక్షకులను ఆశ్చర్య పరచడం లాంటివి ఇప్పటి వరకు చూశాం. కానీ విరాట్ కోహ్లీ కీపింగ్ చేశాడు అన్నది మాత్రం చాలామందికి తెలియదు. కానీ విరాట్ కోహ్లీ  అంతర్జాతీయ మ్యాచ్ లో కూడా కీపింగ్ చేసి అదరగొట్టాడు. 2015లో టీమ్ ఇండియా బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే ధోని వాష్ రూమ్ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిన సమయంలో కోహ్లీకి తన గ్లౌస్ అప్పగించాడు.  ఈ క్రమంలోనే ధోని వచ్చేంతవరకు ఒక ఓవర్ కీపింగ్ చేశాడు విరాట్ కోహ్లీ. ఇక ఆ తర్వాత న్యూజిలాండ్ ఇండియా మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ధోని బౌలింగ్ చేయడానికి వెళ్ళాడు. ఇక ఆ సమయంలో కీపింగ్ బాధ్యతలను విరాట్ కోహ్లీకి అప్పగించాడు ధోని. అలా రెండు సార్లు అంతర్జాతీయ క్రికెట్ లో కీపింగ్ చేశాడు విరాట్ కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: