రషీద్ ఖాన్ చేతుల్లో.. టీమిండియా భవిష్యత్తు?
ఇక రెండు మ్యాచ్ లలో కూడా భారీ తేడాతో విజయం సాధించడంతో టీమ్ ఇండియా రేట్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ఇక టీమ్ ఇండియా సెమీ ఫైనల్కు వెళ్లడంపై భారీగానే ఆశలు పెట్టుకుంది అని చెప్పాలి. అయితే టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు వెళ్ళడం అనేది తమ ప్రదర్శన పై ఆధారపడి లేదు. న్యూజిలాండ్ ప్రదర్శన పై ఆధారపడి ఉంది. నవంబరు 7వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలిచి న్యూజిలాండ్ ఓడిపోతే టీమిండియా సెమీస్ కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.
ఈ క్రమంలోనే ఇక నవంబరు 7వ తేదీన జరగబోయే మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు గెలవాలని భారత్ అభిమానులందరూ కోరుకుంటున్నారు. అయితే ఇక ఇప్పుడు టీమ్ ఇండియా సెమీ ఫైనల్కు చేరాలా లేకపోతే ఇంటికి పోవాలా అన్నది ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కీలక బౌలర్ గా ఉన్న రషీద్ బాగా రాణించి వరుసగా వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాటింగ్ విభాగాన్ని కుప్పకూల్చాడు అంటే ఇక న్యూజిలాండ్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. ఈ క్రమంలోనే రషీద్ ఖాన్ బాగా రాణించాలని కోరుకుంటున్నారు భారత అభిమానులు.