తర్వాతి కెప్టెన్ ఎవరో చెప్పేసిన విరాట్ కోహ్లీ?

praveen
భారత క్రికెట్లో కెప్టెన్గా విరాట్ కోహ్లీ శకం ముగిసింది. మొన్నటి వరకు అన్ని ఫార్మాట్లలో కూడా భారత జట్టు కెప్టెన్గా కొనసాగాడు విరాట్ కోహ్లీ. ఒక కెప్టెన్గా మాత్రమే కాకుండా ఒక ఆటగాడిగా కూడా జట్టుకు ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాడు. అయితే తనపై పని ఒత్తిడి ఎక్కువ కావడంతో తాను టి20 కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకుంటున్నా అంటూ ఇటీవల విరాట్ కోహ్లీ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే. అయితే టి20 వరల్డ్ కప్ తర్వాత తాను కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకుంటాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. కాగా నేడు టీమిండియా వరల్డ్ కప్ లో భాగంగా చివరి మ్యాచ్ ఆడుతుంది.


 ఇక ఈ మ్యాచ్ తో విరాట్ కోహ్లీ కెప్టెన్సి శకం ముగుస్తోంది. అయితే విరాట్ కోహ్లీ తర్వాత టి20 లకు కెప్టెన్ అయ్యేది ఎవరు అన్నదానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే టి20 లకు టీమిండియా కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ పిక్స్ అయిపోయినట్లే అని కొంతమంది భావిస్తున్నారు. ఇక మరోవైపు బీసీసీఐ ఆలోచన ఏమై ఉంటుందా అన్న దానిపై కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో అందరిలో కూడా దీనికి సంబంధించిన చర్చ జరుగుతూ ఉండటం గమనార్హం. అయితే ఇటీవలే తర్వాత టి20 టీమ్ ఇండియా కెప్టెన్ ఎవరు అనే దానిపై ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.


 విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్ అని అందరూ అంటుండగా విరాట్ కోహ్లీ మాటలతో కన్ఫర్మ్ అయిపోయింది. తన మాటలతో తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అని విరాట్ కోహ్లీ స్పష్టత ఇచ్చాడు. అద్భుత ఆటగాళ్లు ఉన్న జట్టును ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తర్వాత కెప్టెన్ పై ఉంది అంటూ వ్యాఖ్యానించాడు. గత కొద్దిరోజుల నుంచి జట్టు విషయాలు అన్నింటినీ కూడా రోహిత్ శర్మ చూసుకుంటున్నాడు. జట్టుతో సారథిగా తను అద్భుత సమయం గడపానని భారత జట్టు గురించి గర్వంగా ఉన్నాను అంటూ విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: