టీ20ల్లో సెన్సేషన్ రికార్డు.. అతనికే సాధ్యమయింది?
ఇక టీ-20 ఫార్మెట్లో ఆడే ప్రతి ఆటగాడు కూడా ఒకసారి బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగాడు అంటే చాలు బంతిని బౌండరీ దాటీంచాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అటు బౌలర్లు కూడా ప్రతి బంతికి ఒక వికెట్ పడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇలా ప్రతీ ఆటగాడికి కూడా టీ20 ఫార్మాట్ అనేది ఒక సవాలుగానే మారిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే కొంతమంది యువ ఆటగాళ్లు క్రికెట్ లో అరుదైన రికార్డు నెలకొల్పడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఎంతో మంది యువ ఆటగాళ్లు క్రియేట్ చేసే రికార్డులలో క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.
అయితే ఇప్పటి వరకు టి20 క్రికెట్ లో మనం ఎన్నో రికార్డుల గురించి వినే ఉంటాం. కానీ ఇక్కడ ఒక యువ బౌలర్ సాధించిన రికార్డు మాత్రం అరుదైనది అని చెప్పాలి విదర్భ బౌలర్ అక్షయ్ కర్నెవర్ అనే బౌలర్ ఇటీవలే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఈ ట్రోఫీలో భాగంగా మణిపూర్ తో జరిగిన టి20 మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా బౌలింగ్ చేశాడు అక్షయ్ కర్నెవర్. అంతేకాదండోయ్ 2 వికెట్లు కూడా పడగొట్టాడు. అయితే ప్రపంచంలో టీ-20లో ఇదే అత్యుత్తమ గణాంకాలు కావడం గమనార్హం.. మరోవైపు బీహార్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో కేవలం రెండు పరుగులు ఇచ్చిన వెంకటేష్ అయ్యర్ రెండు వికెట్లు పడగొట్టాడు.