విరాట్ కెప్టెన్సీపై వీరేంద్ర సెహ్వాగ్ ఏమన్నాడంటే..?
భారత్‌కు చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్, న్యూజిలాండ్‌లతో ప్రపంచకప్ టీ-20 మ్యాచ్‌లలో రెండింటితో ఓడిపోవడంతో భారత్ టోర్ని నుంచి నిష్క్రమించక తప్పలేదు. ఈ రెండు మ్యాచ్‌లలో భారత్ ఘోర ఓటమి పాలు కావడంతో ప్రపంచకప్‌లో తన పేలవంగా ప్రయాణాన్ని ఆరంభించినది భారత జట్టు.
ఆ తరువాత మిగతా అన్ని మ్యాచ్‌లలో ఘన విజయం సాధించినప్పటికీ టోర్నీ నుంచి సెమిస్ వెళ్లే అవకాశాలు లేకపోవడంతో భారత్ ఇంటికి చేరక తప్పలేదు. అదేవిధంగా మిగతా రెండు ఫార్మాట్‌లలో కూడ కోహ్లీ కెప్టెన్సీ భవిష్యత్‌పై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. 33 ఏండ్ల వయస్సు ఉన్న విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా భారత టీమ్‌ను అద్భుతంగా నడిపిస్తున్నాడు అని.. వన్డే, టెస్ట్‌లలో నాయకత్వ పాత్రను కోహ్లీ వదలకూడదని మాజీ క్రికేటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన మనసులో ఉన్న మాటను చెప్పేసాడు.
విరాట్ కోహ్లీ రెండు ఫార్మాట్లలో కెప్టెన్సీని వదులు కుంటాడని తాను అనుకోవడం లేదని, కేవలం టీ-20 కి మాత్రమే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటాడని ఆశిస్తున్నాను. కేవలం ఆటగాడిగా ఆడాలనుకుంటే అది విరాట్ సొంత నిర్ణయం అని, ఆయన మరీ ఏమి డిసైడ్ అయ్యాడో తెలియదు అని అభిప్రాయపడ్డాడు సెహ్వాగ్. విరాట్ కోహ్లీ చాలా తైలివైన వాడు అని ఫేస్‌బుక్ అధికారిక పేజీలో సెహ్వాగ్ వెల్లడించాడు. అదేవిధంగా కోహ్లీ కెప్టెన్సీ నుంచి పూర్తిగా తప్పుకోవాలా వద్దా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సెహ్వాగ్ ఇలా సమాధానం ఇచ్చాడు.
కోహ్లి మంచి ఆటగాడని, దూకుడుగా ఉండే భారత జట్టు కెప్టెన్. భారత జట్టుకు మంచి నాయకత్వం వహిస్తున్నాడు ప్రస్తుతం. కోహ్లి టెస్టులకు, వన్డేలకు కెప్టీన్సీ వదిలి వేయడం, లేక వదిలి వేయకపోవడం అతని వ్యక్తిగత నిర్ణయం అని సమాధానం చెప్పాడు సెహ్వాగ్. అయితే ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శనకు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఓపెనర్ వివరించాడు తన అభిప్రాయం. మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీలో 2013 ఛాంపియన్స్ ట్రోపి ఘన విజయం తరువాత భారత్ ఇప్పటివరకు ఐసీసీ టైటిట్‌ను గెలుచుకోలేదని నొక్కి మరీ చెప్పాడు సెహ్వాగ్.
కొన్ని దశల్లో మేము జట్టుకు మద్దతు ఇవ్వాలనుకుంటాం. చాలా కాలం నుండి ఏ ప్రధాన ఐసీసీ టోర్నమెంట్ నుంచి భారత్ గెలువలేక పోయిందని, ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ద్వైపాక్షిక సిరీస్‌లు గెలవడమే కాదని, ముఖ్యంగా ప్రపంచ టోర్నీలను నిలకడగా గెలిస్తేనే ప్రజలు మనల్ని గుర్తుంచుకుంటారు అని సెహ్వాగ్ వెల్లడించారు. నవంబర్ 17నుంచి న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో భారత్ స్వదేశంలో బరిలోకి దిగనున్నది. ఇక కొత్త కెప్టెన్ రోహిత్‌శర్మ, కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎలాంటి ఫలితాలు సాధిస్తారో అప్పటివరకు వేచి చూడాలి మరి.