దెబ్బకు దెబ్బ... బెన్ స్టోక్స్ ఉంటే కథ వేరేలా ఉండేదా?

VAMSI
రెండు సంవత్సరాల క్రితం జరిగిన వన్ డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ను వినూత్నంగా ఓడించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో మొదట ఇరు జట్ల స్కోర్స్ లెవెల్ అవడంతో సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయించడానికి అంపైర్స్ మొగ్గు చూపారు. అయితే విచిత్రంగా సూపర్ ఓవర్ కూడా టై కావడంతో ఏమి చేయాలో తెలియక, అంపైర్స్ విజేతను మ్యాచ్ లో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లాండ్ ను విశ్వ విజేతగా ప్రకటించి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. క్రికెట్ చరిత్రలో వరల్డ్ కప్ లో ఈ విధమైన ఫలితం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆ రోజు న్యూజిలాండ్ ప్లేయర్స్ అంతా తీవ్ర నిరాశలో మునిగిపోయారు. వారి ఖాతాలో ఒక్క వరల్డ్ కప్ టైటిల్ కూడా లేదు. వచ్చిన అవకాశం ఇలా వృధా అయిపోయింది.

సో ఆ ఛాన్స్ మళ్ళీ నిన్న టీ 20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ తో మ్యాచ్ ద్వారా వచ్చింది. ఇక వచ్చిందే అదునుగా అసాధారణమైన ఆటతీరును కనబరిచిన కివీస్ ఇంగ్లాండ్ ను ఒక్క ఓవర్ మిగిలి ఉండగానే ఓడించి బదులు తీర్చుకుంది. నిన్న జరిగిన మొదటి సెమిఫైనల్ లో టాస్ గెలిచిన కివీస్ ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇంగ్లాండ్ తడబడుతూ ఇన్నింగ్స్ ప్రారంభించినా చివరికి మొయిన్ అలీ మరియు లివింగ్ స్టోన్ లు హిట్ చేయడంతో 166 పరుగుల స్కోర్ ను చేయగలిగింది. అయితే 167 పరుగుల లక్ష్యంతో ఛేదన స్టార్ట్ చేసిన కివీస్ ఆరంభంలోనే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  అయితే మరో ఓపెనర్ తో జత కలిసిన కాన్ వే మరో వికెట్ర్ పడకుండా మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

దాదాపు 16 ఓవర్ల వరకు ఇంగ్లాండ్ ఫేవరెట్ గా ఉంది. కానీ 17 ఓవర్  లో నీషం మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు.  ఆ ఓవర్ లో జోర్డాన్ మొత్తం 23 పరుగులు ఇచ్చి మ్యాచ్ ను న్యూజిలాండ్ కు ఇచ్చేశాడు. దానితో సమీకరణాలు మారిపోయాయి. మిగిలిన పనిని డారిల్ మిచెల్ పూర్తి చేశాడు. ఒక్క ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్ లో అడుగుపెట్టింది కివీస్. దీనితో మరో టైటిల్ పై కన్నేసిన మోర్గాన్ సేనకు షాక్ తగిలింది. అయితే గతంలోలాగా ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ జట్టులో బెన్ స్టోక్స్ ఉంది ఉంటే కథ వేరేలా ఉండేదని ఇంగ్లాండ్ అభిమానులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: