ఫైనల్లో గెలిచేది ఆ జట్టే : గంగూలీ

praveen
టి20 ప్రపంచ కప్ లో ఆఖరి సమరానికి అంతా సిద్ధమైంది. ఫైనల్ పోరు వీక్షించేందుకు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం టీవీల ముందుకు వచ్చేసింది. మరి కొన్ని నిమిషాల్లో క్రికెట్ ప్రపంచం మొత్తం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న ఫైనల్ పోరు ప్రారంభం కాబోతోంది. ఇక ఈ ఫైనల్ పోరులో ఐదుసార్లు వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. కొన్ని రోజుల క్రితమే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచి విశ్వవిజేతగా నిలిచిన న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. అయితే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వరుస విజయాలను సాధించి ఈ రెండు జట్లు కూడా ఫైనల్ వరకు చేరుకున్నాయి. ఈ రెండు జట్ల బలాబలాలు కూడా సమానం గానే ఉన్నాయి అని చెప్పాలి.

 దీంతో నేడు జరగబోయే ఫైనల్ పోరులో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే టాస్ గెలిచిన వారికి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకుల ఇప్పటికే అంచనా వేస్తున్నారు. మరోవైపు అటు మాజీ క్రికెటర్లు అందరూ ఇక ఫైనల్ పోరులో ఎవరు గెలవబోతున్నారో అనే దానిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. అయితే ప్రస్తుతం ఫైనల్ పోరులో తలపడుతున్న రెండో జట్లలో ఏ జట్టు గెలిచిన కూడా టీ20 ప్రపంచకప్ లో కొత్త ఛాంపియన్ అవతరిస్తుంది. అయితే కొంతమంది ఆస్ట్రేలియా విజయం సాధిస్తుంది అని చెబుతుంటే మరికొంత మంది న్యూజిలాండ్ జట్టు గెలుస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

 ఇకపోతే ఇటివలే బీసీసీఐ చైర్మన్ భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఫైనల్ పోరు ఫలితంపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈసారి న్యూజిలాండ్ జట్టు ఛాంపియన్ గా అవతరించే అవకాశం ఉంది అంటూ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్లో ఇది న్యూజిలాండ్ సమయం అని భావిస్తున్నాను ఆస్ట్రేలియా గొప్ప దేశం క్రికెట్లో ఆ దేశం ఎంతో ఉన్నత స్థాయికి చేరింది. కానీ ఆ జట్టు కొంతకాలంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. న్యూజిలాండ్ చిన్న దేశం అయినప్పటికి ఎంతో ధైర్యంగా ఆడుతోంది. న్యూజిలాండ్ చిన్నదేశం అయినప్పటికీ చాలా బలమైన దేశం న్యూజిలాండ్ కప్పు గెలుస్తుందని భావిస్తున్నాను సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: