వరల్డ్ కప్ ఫైనల్.. మనోళ్లే అదరగొట్టారు?

praveen
భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా. టీ20 వరల్డ్ కప్ లో  పేలవ ప్రదర్శన చేసి సెమీఫైనల్కు వెళ్లకుండానే ఇంటిదారి పట్టింది అన్న విషయం తెలిసిందే. టి20 వరల్డ్ కప్ లో టీమిండియా తప్పకుండా కప్ గెలిచి తీరుతుంది అని అందరూ గట్టి నమ్మకంతో ఉన్న సమయంలో టీమిండియా అందరినీ తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ క్రమంలోనే ఇక టీమిండియా వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంతో  ఎంతో మంది భారత క్రికెట్ ప్రేక్షకులు అటు ఐపీఎల్ లో ఆడే ఆటగాళ్ల ను సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇక మన తెలుగు వాళ్ళు కూడా  సన్రైజర్స్ ఆటగాళ్లను తెగ సపోర్ట్ చేస్తున్నారు.


 ఈ క్రమంలోనే కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు గెలవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు  ఆడుతున్న సమయంలో డేవిడ్ వార్నర్ అద్భుతంగా రాణించాలని  ఎంతోమంది తెలుగు క్రికెట్ ప్రేక్షకులు సపోర్ట్ చేస్తున్నారు అనే చెప్పాలి. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో న్యూజిలాండ్ జట్టు నుంచి కేన్ విలియమ్సన్ ఇక ఆస్ట్రేలియా జట్టు నుంచి డేవిడ్ వార్నర్ మిచెల్ మార్ష్ లు కొనసాగుతున్నారు. ఫైనల్ లో భాగంగా ఇక న్యూజిలాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరుగగా ఇక ఈ ముగ్గురు క్రికెటర్లు అద్భుతంగా రాణించారు అని చెప్పాలి.



 అయితే అటు వరల్డ్ కప్ నుంచి టీమిండియా జట్టు అంచనాలను అందుకోలేక నిష్క్రమించింది దీంతో నిరాశ లో మునిగిపోయారు అభిమానులు. కానీ నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫాన్స్ కి కొంత ఊరట కలిగించింది. ఈ మ్యాచ్లో కేన్ విలియమ్సన్,డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్  లాంటి సన్రైజర్స్ జట్టు ఆటగాళ్లు మెరుపులు మెరిపించారు. కేన్ విలియమ్సన్ 48 బంతుల్లో 88 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. ఇక ఆ తర్వాత డేవిడ్ వార్నర్ 53 పరుగులు చేశాడు.ఇక మరో ఆటగాడు మిచెల్ మార్ష్ 50 బంతుల్లో 77 పరుగులు చేశాడు.. ఇలా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లందరూ అద్భుతంగా రాణించడంతో  తెలుగు క్రికెట్ ప్రేక్షకులందరికీ కాస్త ఊరట కలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: