ఆస్ట్రేలియ ఆటగాళ్లు.. షూలో బీరు ఎందుకు తాగారో తెలుసా?
అయితే దశాబ్దాల కల నెరవేరడంతో ఆస్ట్రేలియా జట్టులో ఆటగాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. మ్యాచ్ గెలిచిన వెంటనే ఆటగాళ్లందరూ మైదానంలోకి చేరుకొని ఒకరినొకరు హత్తుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో కూడా సంబరాల్లో మునిగిపోయారు. అయితేఇలా గెలిచిన ఆనందంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లుచేసుకున్న సెలబ్రేషన్స్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి. ఏకంగా కాలి బూటులో బీరు పోసుకొని తాగారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది
అయితే ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇలా బూటులో బీర్ పోసుకొని తాగడానికి ఒక పెద్ద కారణమే ఉందట. పాత ఆచారాన్ని క్రికెట్ అభిమానులకు ఆటగాళ్లు పరిచయం చేసినట్లు తెలుస్తోంది.. బూటులో బీర్ పోసుకుని తాగే ఆచారం 18వ శతాబ్దంలో జర్మనీ లో మొదలై తర్వాత ఆస్ట్రేలియాలో బాగా పాపులర్ అయ్యిందట ఇక దీని షూయి అని పిలుస్తారట. అయితే ఇటీవలే ఆస్ట్రేలియన్ రైడర్ జాక్ మిల్లర్ షూయి ఆచరణలో భాగంగా పొడియం మీదా అందరి ముందు షూ లో బీర్ పోసుకుని తాగి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక అప్పట్నుంచి చాలా మంది ఆటగాళ్లు ఇది ప్రయత్నిస్తున్నారు. విజయానికి ప్రతీకగా ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారట. అయితే బ్యాక్టీరియా కు కేంద్ర బిందువైన షూ లో బీరు తాగడం మాత్రం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తూ ఉండటం గమనార్హం.