ఈసారి ఐపీఎల్ వేలంలో..అందరి కన్ను అతనిపైనే : సన్నీ
ముఖ్యంగా ఐపీఎల్లో రాణించలేక పోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. అంతేకాదు కెప్టెన్గా ఉన్న డేవిడ్ వార్నర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించింది జట్టు యాజమాన్యం. అంతేకాదు పూర్తిగా డేవిడ్ వార్నర్ ను పక్కన పెట్టేసింది. ఎంతోమంది వార్నర్ కి వయసు అయిపోయింది అంటూ విమర్శలు కూడా చేశారు. ఇలాంటి సమయంలో డేవిడ్ వార్నర్ అద్భుతంగా పుంజుకున్నాడు.. టి20 వరల్డ్ కప్ లో తనపై ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా అద్భుతంగా రాణించాడు డేవిడ్ వార్నర్. ఏకంగా భారీగా పరుగులు చేసి మాన్ అఫ్ ది సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.
దీంతో ప్రస్తుతం అందరూ డేవిడ్ వార్నర్ గురించే మాట్లాడుకుంటున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించి భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలో జరగబోయే ఐపీఎల్ వేలం లో డేవిడ్ వార్నర్ కు మంచి డిమాండ్ ఉండబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో జట్ల యాజమాన్యాలు వార్నర్ కోసం ఎగబడతారు. ఇక అన్ని జట్లు ఎక్కువగా కోరుకునే ఆటగాళ్ల జాబితాలో వార్నర్ ముందుంటాడు. కెప్టెన్గా ఆటగాడిగా వార్నర్ కు ఉన్న అనుభవం టీ-20 ఫార్మెట్లో అతడు బాగా సరిపోతాడు. పరిస్థితులు చూస్తుంటే సన్రైజర్స్ అతన్ని అంటి పెట్టుకునే లేదు అంటూ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.