హార్థిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐదు కోట్ల వాచ్ సీజ్?

praveen
భారత క్రికెట్లో హార్దిక్ పాండ్యా కీలకమైన ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. తన ఆటతో ఎప్పుడూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ నే ఉంటాడు. ఒకసారి హార్దిక్ పాండ్యా బరిలోకి దిగాడు అంటే చాలు స్కోర్ బోర్డు పరుగులు పెడుతూ ఉంటుంది. అయితే ఎప్పుడు టి-20 ఫార్మెట్లోనూ ఇరగదీసే హార్దిక్ పాండ్యా ఇటీవల టి20 వరల్డ్ కప్ లో  మాత్రం పేలవ ప్రదర్శన చేసి నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా తీరుపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. హార్దిక్ పాండ్యా తన ఆటతీరుతో ఎంత ఫేమస్ అయ్యాడో తను వాడే బ్రాండ్లతో కూడా సోషల్ మీడియాలో అంతే ఫేమస్ అయ్యాడు.


 ఎంతో కాస్ట్లీ బ్రాండ్లను వాడటానికి హార్దిక్ పాండ్యా ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఖరీదైన కార్లు ఖరీదైన వాచ్ లను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. ఇప్పటికే హార్దిక్ పాండ్యా దగ్గర ఎన్నో ఖరీదైన వాచ్ లు ఉన్నాయి. హార్దిక్ పాండ్య కొనుగోలు చేసే వాచ్ లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. అయితే ఇటీవలే హార్దిక్ పాండ్యా కు  ఖరీదైన వాచ్ లతో కాస్త ఊహించని షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన వాచ్ లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది ఇటీవల టి20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్కు చేరే అర్హత సాధించలేక టీమిండియా ఇంటిదారి పట్టింది. దీంతో భారత్కు తిరిగి వస్తున్న సమయంలో ఎయిర్ పోర్టులో తనిఖీలు నిర్వహించగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.


 అయితే టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దగ్గరనుంచి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న వాచ్ ల విలువ ఏకంగా 5 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా హార్దిక్ పాండ్యా వద్ద అత్యంత ఖరీదైన ప్రముఖ కంపెనీలకు చెందిన వాచ్ కలెక్షన్ ఉంది. ఇకపోతే ఇటీవల ఎంతో ఖరీదైన వాచ్ ను
 2021 ఐపీఎల్ ప్రారంభానికి ముందుచేతికి పెట్టుకుని ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు హార్దిక్ పాండ్య. ఇప్పుడు ఈ వాచ్ కూడా సీజ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇక ఈ వాచ్ లను ఎందుకు సీజ్ చేశారు అన్నది మాత్రం ప్రస్తుతం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: