సచిన్, ద్రావిడ్ కలిస్తే.. ఈ యువ ఆటగాడు?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ దిగ్గజ క్రికెటర్ లుగా కొనసాగుతున్నారు. ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్కు ఎనలేని సేవలు అందించారు  ఈ మాజీ క్రికెటర్లు. ఇక ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్లో స్టార్ ఆటగాళ్లు కొనసాగి  ప్రపంచ క్రికెట్లో టీమిండియా కు గొప్ప గౌరవాన్ని తెచ్చి పెట్టారు. ఇక ప్రస్తుతం ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ వీరికి మాత్రం భారత క్రికెట్లో ఒక అరుదైన గౌరవం ఉంటుంది. ప్రతి యువ క్రికెటర్ కి కూడా ఈ ఇద్దరు క్రికెటర్లు ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ఎంతో మంది యువక్రికెటర్లు రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజ క్రికెటర్ ను ఆదర్శంగా తీసుకుని భారతక్రికెట్లోకి అరంగేట్రం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.


 సాధారణంగా క్రికెటర్ల కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే క్రికెట్ అభిమానులు తమ అభిమాన క్రికెటర్ల పేర్లను తమ పిల్లలకు పెట్టుకోడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా సీనియర్ క్రికెటర్ల పేర్లు పెట్టుకున్న వారు ఆ తర్వాత కాలంలో మళ్ళీ అదే క్రికెట్లోకి అరంగేట్రం చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. అయితే రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ లను కలిపితే ఇక ఈ న్యూజిలాండ్ ఆటగాడు అవుతాడు. అదేంటి అతను అంత దిగ్గజ క్రికెటరా అని అనుకుంటున్నారా.. అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పుడిప్పుడే  బుడిబుడి అడుగులు వేస్తున్నాడు ఆ క్రికెటర్.



 మరి భారత దిగ్గజ క్రికెటర్ లు  సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ కలిపితే ఆ క్రికెటర్ కావడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా.. దాని వెనుక పెద్ద స్టోరీ ఉంది. ఇటీవల భారత్ లో జరుగుతున్న టి20 లో న్యూజిలాండ్ తరపున ఆడుతున్నాడు రచిన్ రవీంద్ర. 22 ఏళ్ళ రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు భారతీయులే. 90లలో న్యూజిలాండ్ కు వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయారు. వీరు రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ లకు వీరాభిమానులు. దీంతో రాహుల్ లోని రా అక్షరం.. సచిన్ లోని చిన్  అక్షరం.. కలిపి తమ కొడుకుకి రచిన్ అని పేరు పెట్టారు. కొన్నాళ్లుగా దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న ఈ యువ ఆటగాడు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో కూడా అవకాశాన్ని దక్కించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: