వన్డేల్లో కోహ్లీ కంటే రోహిత్ బెస్ట్ : గంగూలీ
అంతేకాదు ఇక విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షేమ్ ఆన్ బీసీసీఐ అంటూ సోషల్ మీడియాలో ఒక హాష్ టాగ్ కూడా వైరల్ గా మారుతుంది. విరాట్ కోహ్లీ లాంటి బెస్ట్ కెప్టెన్ ను బీసీసీఐ తొలగించడం ఏంటి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అయితే టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దు అంటూ విరాట్ కోహ్లీకి సూచించాము. తమ అభ్యర్థనను లెక్కచేయకుండా కోహ్లి వైస్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇద్దరు కెప్టెన్లు ఉండటం మంచిది కాదు అనే ఉద్దేశంతోనే ఇక వన్డే కెప్టెన్సీ కూడా రోహిత్ శర్మ కు అప్పగించాము అంటూ బిసిసిఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ వివరణ ఇచ్చారు.
ఇక ఇటీవలే మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ. టీమిండియాకు వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మను ఎంపిక చేయడం సరైన నిర్ణయం అంటూ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. ఈ నిర్ణయం తీసుకునే ముందు వన్డే కెప్టెన్గా కోహ్లీ విన్నింగ్ పర్సంటేజ్ పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపాడు.. కానీ వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డు ఇంకా చాలా బాగుంది అంటూ తెలిపాడు. మాకు రోహిత్ పై నమ్మకం ఉంది. వైట్ బాల్ క్రికెట్ లో కెప్టెన్గా ఎన్నో విజయాలను విజయాలు అందించిన కోహ్లీకి కృతజ్ఞతలు అంటూ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.