కోహ్లీని కాదని రోహిత్ కు వన్డే కెప్టెన్సీ.. గంభీర్ ఏమన్నాడంటే?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్లో ఒకటే చర్చ జరుగుతుంది. అదే వన్డే కెప్టెన్సీ నుండి కోహ్లీని తప్పించి రోహిత్ శర్మను నియమించడంగురించి. తాను టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని టెస్టులకు కెప్టెన్గా కొనసాగుతాను  విరాట్ కోహ్లీ ప్రకటించాడు. చెప్పినట్లుగానే టి20 కెప్టెన్గా తప్పుకున్నాడు. దీంతో కొత్త  టి20  కెప్టెన్గా రోహిత్ శర్మను నియమించింది బీసీసీఐ. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్కు ఒకే కెప్టెన్ ను నియమించే అవకాశం ఉంది అంటూ టాక్ వినిపించింది దీంతో ఇక వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించే అవకాశం ఉంది అని అందరూ అనుకున్నారు. ఇక అనుకున్నట్లుగానే వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్ శర్మను కొత్త కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ.


 దీంతో భారత క్రికెట్ లో తీవ్రమైన చర్చ జరిగింది. విరాట్ కోహ్లీ లాంటి ఒక మంచి కెప్టెన్ ను బిసిసిఐ తొలగించడం ఏంటి అంటూ ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే స్వయంగా రంగంలోకి దిగిన బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ టి20 కెప్టెన్సీ  నుంచి కోహ్లీ తప్పుకోవాలని అనుకున్నప్పుడే తాము వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నాము అంటూ తెలిపాడు. పరిమిత ఓవర్ల క్రికెట్కు ఇద్దరు కెప్టెన్ లు ఉండటం మంచిది కాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు సౌరబ్ గంగూలీ. ఇక సౌరవ్ గంగూలీ నిర్ణయాన్ని అటు ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా సమర్ధిస్తూ మద్దతు పలికారు.



 ఇటీవలే టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ సైతం ఈ విషయంపై స్పందిస్తూ బీసీసీఐ కెప్టెన్సీ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించాడు. వన్డే టి20 జట్లకు కెప్టెన్గా తనదైన రీతిలో నడిపించేందుకు రోహిత్ కు తగిన సమయం ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చాడు గౌతం గంభీర్. వైట్, రెడ్ బాల్ గేమ్ లకు ఇద్దరు కెప్టెన్ లు ఉండడం భారత క్రికెట్ కు ఎంతో మంచిది అంటూ తెలిపాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో ఐదు సార్లు ఛాంపియన్గా గెలిచింది. ఇతర  కెప్టెన్ లతో పోల్చి చూస్తే అటు ఎంతో విభిన్నంగా జట్టును నడిపించేందుకు రోహిత్ శర్మ ప్రయత్నిస్తాడు అంటూ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: