అందుకే నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించారేమో : కోహ్లీ

praveen
భారత క్రికెట్ లో గత కొన్ని రోజుల నుంచి కెప్టెన్సీ మార్పుకు సంబంధించిన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరుకున్నాయి అంటూ ఎన్నో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. బీసీసీఐ తనను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై విరాట్ కోహ్లీ ఎంతో కోపంగా వున్నాడు అంటూ కూడా వినిపించింది. ఇలాటీమిండియా వన్డే జట్టుకు కెప్టెన్గా రోహిత్ శర్మను నియమించిన నాటి నుంచి అంతటా దీనికి సంబంధించిన చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు కెప్టెన్సీ మార్పు విషయంలో పుకార్లకు తెర దించుతూ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చాడు విరాట్ కోహ్లీ.



 ప్రెస్ మీట్ లో భాగంగా రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా కెప్టెన్సీ మార్పు పై కీలక వ్యాఖ్యలు చేశాడు రోహిత్ శర్మకు తనకు మధ్య ఎలాంటి సమస్యలు లేవు అంటూ విరాట్ కోహ్లీ తెలిపాడు. కెప్టెన్గా తాను వంద శాతం ఎఫర్ట్ పెట్టాను అంటూ చెప్పుకొచ్చాడు. టి20 కెప్టెన్సీ వదులుకుంటాను అని బిసిసిఐకి చెప్పిన సమయంలో ఎవరు వద్దు అని అనలేదు. ఇక టి20 కెప్టెన్సీ వదులుకున్న సమయంలోనే టెస్టులకు వన్డేలకు కెప్టెన్గా కొనసాగుతానని చెప్పాను.


 అయితే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూన్నాము అన్న విషయాన్ని బిసిసిఐ తనకు ముందుగా చెప్పలేదు. జట్టు ప్రకటించడానికి దాదాపు గంటన్నర ముందు మాత్రమే బిసిసిఐ సెలెక్టర్లు నాతో మాట్లాడారు. చివరగా సంభాషణ ముగింపు సమయంలో వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూన్నాము అంటూ సెలెక్టర్లు చెప్పారు అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటివరకూ తన కెప్టెన్సీలో ఒక్కసారి కూడా ఐసీసీ ఈవెంట్ గెలవకపోవడం కారణంగానే తనను కెప్టెన్సీ నుంచి తప్పించి ఉండవచ్చు అంటూ విరాట్ కోహ్లీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అదే సమయంలో సౌత్ ఆఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్ కు తాను అందుబాటులో ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: