రోహిత్, కోహ్లీ గొప్పేం కాదు.. క్రీడల మంత్రి షాకింగ్ కామెంట్స్?
ఈ క్రమంలోనే ఇటీవలే గాయం బారిన పడిన రోహిత్ శర్మ సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్టు జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే అటు విరాట్ కోహ్లీ కూడా తన కూతురు పుట్టినరోజు వేడుకలు కారణంగా చూపుతూ వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది అని అందరూ అనుకున్నారు. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి అంటూ ఎన్నో వార్తా కథనాలు కూడా వచ్చాయి.తాజాగా ఇదే విషయంపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు.రోహిత్, విరాట్ కోహ్లి మధ్య ఉన్న విభేదాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వ్యక్తుల కంటే ఆటే గొప్పది అంటూ వ్యాఖ్యానించారు. ఆట కంటే ఎవరు గొప్ప కాదు అంటూ తెలిపాడు. కోహ్లీ రోహిత్ గొప్ప క్రికెటర్లు అయినప్పటికీ వారి కంటే ఆటే గొప్పది అంటు ఇండైరెక్ట్‌గా చెప్పారు. అయితే దేశంలో ఏ క్రీడలో ఆటగాళ్ల మధ్య ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు. అది సంబంధిత ఫెడరేషన్ అసోసియేషన్ చూసుకుంటాయి. వాళ్లు సమాచారం ఇచ్చినప్పుడు మాత్రమే నాకు తెలుస్తుంది అంటూ క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. ఇకపోతే ఇగోల కారణంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఒకరి కెప్టెన్సీలో ఒకరు ఆడటానికి అస్సలు ఇష్టపడటం లేదని ఇద్దరు ఆటగాళ్ళు ఇగోలు చివరికి భారత క్రికెట్ కు పెద్ద ప్రమాదంగా మారుతున్నాయి అంటూ ఎంతగానో టాక్ వినిపించింది.