కోహ్లీ షాకింగ్ కామెంట్స్.. స్పందించిన బీసీసీఐ?
అది టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న సమయంలోనే
కెప్టెన్సీ నుంచి తప్పుకో వద్దు అంటూ కోహ్లీ రిక్వెస్ట్ చేశాము .. కానీ కోహ్లీ తమ మాట వినలేదని చెప్పుకొచ్చింది. అయితేకెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత అసలు కోహ్లీ ఏమనుకుంటున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఇటీవల మీడియా సమావేశం నిర్వహించగా మీడియా చూపు మొత్తం కోహ్లీ ఏం మాట్లాడ పోతున్నాడు అనే దానిపై కి వెళ్ళిపోయింది. టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న సమయంలో తనకు ఎవరూ వద్దు అని చెప్పలేదు. అంతేకాకుండా వన్డే కెప్టెన్సీ తొలగించడానికి గంటన్నర ముందు మాత్రమే తనకు సమాచారం ఇచ్చారు అంటూ విరాట్ కోహ్లీ కామెంట్ చేయడం సంచలనంగా మారింది.
అయితే కోహ్లీ సమాధానం ఒకలా బిసిసిఐ చెప్పింది మరోలా ఉండడంతో ప్రస్తుతం భారత క్రికెట్ ప్రేక్షకులందరూ అయోమయంలో పడిపోయారు. కోహ్లీ వ్యాఖ్యలు చేసిన వెంటనే బిసిసిఐ స్పందించింది. టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకునే టప్పుడు వద్దని వారించాము అంటూ స్పష్టం చేసింది. అంతేకాకుండా వన్డే సారధ్యం నుంచి తొలగించే గంటన్నర ముందే చెప్పాం అన్నది పూర్తిగా అవాస్తవమని.. ఎన్నో రోజుల ముందు నుంచే దీని గురించి ఎంతో క్లియర్గా చర్చ జరిగింది అంటూ బిసిసిఐ స్పష్టం చేసింది. పరిమిత ఓవర్ల క్రికెట్కు ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదు అన్న ఉద్దేశంతోనే కోహ్లీ ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాము అంటూ తెలిపింది బీసీసీఐ.