షాకింగ్ : 5 గురు క్రికెటర్లకు కరోనా?
ఇక క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న ఇరు జట్లు కూడా కేవలం హోటల్ గదికి మాత్రమే పరిమితం చేస్తూ క్వారంటైన్ లో పెడుతున్నారు. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు కరోనా వైరస్ మాత్రం పంజా విసురుతుంది. ఎంతో మంది క్రికెటర్లు వైరస్ బారిన పడుతూ ఉండడం తో ఏకంగా మ్యాచ్ లు క్యాన్సిల్ అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలా ఇప్పటి వరకూ ఆటగాళ్లు చేసిన చిన్న పొరపాట్లు ఏకంగా బయో బబుల్ లోకి వైరస్ వచ్చేలా చేసాయి అన్న విషయం తెలిసిందే.. ఇకపోతే ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు కొన్ని దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వెళ్లింది.
ఇక పాకిస్థాన్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం పాక్ జట్టుతో టి-20 సిరీస్ ఆడుతుంది. అయితే కఠినమైన బయో బబుల్ లో ఉన్నప్పటికీ అటు కరోనా వైరస్ మాత్రం షాకిస్తూనే వస్తుంది. ఇప్పటికే ముగ్గురు క్రికెటర్లు వైరస్ బారిన పడ్డారు. ఇక ఇప్పుడు మరో ఐదుగురికి కూడా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్లేయర్లు హోప్, హుస్సేన్, గ్రీవ్స్ తో పాటు అసిస్టెంట్ కోచ్, టీం ఫిజిషియన్ కూడా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఇక ఇలాగే ఆటగాళ్లు వైరస్ బారిన పడితే రానున్న రోజుల్లో పర్యటన రద్దు అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.