లక్కంటే ఇదే మరి.. కెప్టెన్లుగా మారబోతున్న యువ ఆటగాళ్లు?

praveen
ఐపీఎల్ దగ్గరపడుతున్న కొద్దీ ప్రస్తుతం అందరూ ఒకే దాని గురించి చర్చించుకుంటున్నారు. ఐపీఎల్ మెగా వేలంలో ఏ ఆటగాడు ఎంత ధర పలక పోతున్నాడు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతే కాకుండా ఎవరు ఏ జట్టులోకి వెళ్ళపోతున్నారు అన్నది కూడా ఊహకందని విధంగా మారిపోయింది. ఇక ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త జట్లకు ఎవరు కెప్టెన్గా వ్యవహరించపోతున్నారు అన్నది కూడా ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. 2022 ఐపీఎల్ సీజన్ కోసం ప్రస్తుతం ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీ లతోపాటు మరో రెండు ఫ్రాంచైజీలు కూడా ఐపీఎల్ లోకి అడుగుపెట్టబోతున్నాయ్.



 అయితే ఐపీఎల్ మెగా వేలానికి ముందే ఇక ఈ కొత్త తమ తమ  జట్లకు కెప్టెన్గా ఎంచుకునే ఆటగాళ్లను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది అని టాక్ కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు మెగా వేలంలో ముగ్గురు ప్లేయర్లను దాదాపు ఖరారు చేసుకునే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం కె.ఎల్.రాహుల్  కెప్టెన్గా మారబోతున్నాడు అనేది తెలుస్తుంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ని ఇటీవలే ఫ్రాంచైజీ వదిలేసుకుంది. ఈ క్రమంలోనే తమ జట్టుకు కె.ఎల్.రాహుల్ ని కెప్టెన్గా నియమించాలని లక్నో ఫ్రాంచైజీ ఎంతో మొగ్గు చూపుతుందట.


 అదే సమయంలో గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన  శ్రేయస్ అయ్యర్ జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించడం తో ఇప్పుడు అయ్యర్ ను కూడా కెప్టెన్సీ చాన్స్  దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి శ్రేయస్ అయ్యర్ ను కెప్టెన్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కేఎల్ రాహుల్ తో పాటు రషీద్ ఖాన్ ఇషాన్ కిషన్ లక్నో లక్నో ఫ్రాంచైజీ ఫైనల్ చేసిందట. మరోవైపు శ్రేయస్ అయ్యర్ తో పాటు హార్దిక్ పాండ్యా సహా మరో ఆటగాడిని కూడా అహ్మదాబాద్ జట్టు తీసుకోవాలని భావిస్తోందని తెలుస్తోంది. 2014 తర్వాత జరుగుతున్న మెగా వేలం కావడంతో ఈ మెగా వేలంపై ప్రస్తుతం భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: