అతను సెలక్టర్ల దృష్టి లో ఉన్నాడు : ఆకాష్ చోప్రా

praveen
మొన్నటికి మొన్న ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అదరగొట్టిన రుతు రాజ్ గైక్వాడ్   ఇక ఇప్పుడు అదే ఫార్ములా కొనసాగిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. భారీ స్కోర్లు చేయడం కాదు ఏకంగా వరుసగా సెంచరీలు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు..  2021 ఐపీఎల్ సీజన్  లో చెన్నై సూపర్ కింగ్స్ గెలవడానికి ఎంతో కీలక పాత్ర వహించాడు రుతు రాజ్ గైక్వాడ్. ప్రతి మ్యాచ్లో కూడా భారీగా పరుగులు చేశాడు.. ఓపెనర్ గా బరిలోకి దిగుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఇక ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ లో కూడా రుతు రాజ్ గైక్వాడ్ సృష్టిస్తున్న సునామి  అంత ఇంతా కాదు అని చెప్పాలి. ఇక వరుసగా సెంచరీలు చేస్తూ అదరగొడుతున్నాడు రుతు రాజ్ గైక్వాడ్ .


 ఈ క్రమంలోనే ప్రస్తుతం రుతు రాజ్ గైక్వాడ్  ఉన్న ఫామ్ చూస్తే దక్షిణాఫ్రికా పర్యటనకు సెలెక్టర్లు ఎప్పుడైనా అతన్ని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో రుతు రాజ్ గైక్వాడ్  తప్పకుండా చేరుతాడు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎంతో మంది మాజీ ఆటగాళ్లు. ఇప్పటికే భారత సెలెక్టర్లు దృష్టి అతనిపై పడింది అని అంటున్నారు. ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించాడు మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా. రుతు రాజ్ గైక్వాడ్  అద్భుతంగా రాణిస్తూ ఉండడం పై ప్రశంసల వర్షం కురిపించాడు.


 విజయ్ హజారే ట్రోఫీ లో రుతు రాజ్ గైక్వాడ్   అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడు ఏ బౌలర్ కు భయపడకుండా ఆడుతున్నాడు. వరుసగా సెంచరీలు కూడా చేయగలుగుతున్నాడు. అతని వికెట్ తీయడానికి ప్రస్తుతం బౌలర్లు ఎంతగానో కష్టపడి పోతున్నారు. ఫాస్ట్ పేస్ బౌలింగ్ లో స్వీప్ షాట్లు ఆడటం అతను ఒక్కడికే సాధ్యం అయింది అని చెప్పాలి. ఇక ఈ సీజన్లో అద్భుతంగా రుతు రాజ్ గైక్వాడ్  రాణిస్తున్నాడు. అతను చేస్తున్న పరుగుల నేపథ్యంలో ఇప్పటికే సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు అంటూ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఇలా ఆకాష్ చోప్రా చెప్పిన దాని ప్రకారం ఏ క్షణంలోనైనా సెలక్టర్లు అతని సౌత్ ఆఫ్రికా పర్యటనకు సెలెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: