ఐపీఎల్ : మెగావేలం వాయిదా.. ఎందుకంటే..?
అహ్మదాబాద్ ఫ్రాంచైజీ యాజమాన్యానికి సంబంధించిన అంశంపై కమిటీ నిర్ణయము ఇప్పటివరకు ఫైనల్ కాలేదంటూ బీసీసీఐ అధికారులను ఉటంకిస్తూ సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నిర్ణయం అధికారికంగా వచ్చే వరకు వేలం తేదీలను ఖరారు చేయడం సాధ్యం కాదని సమాచారం. ఆ తరువాత లక్నో, అహ్మదాబాద్ జట్లు కూడా ఐపీఎల్ వేలానికి ముందు చెరో 3 ఆటగాళ్లను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జనవరి మూడో లేదా నాలుగో వారంలో వేలం నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టమవుతోంది. జనవరి తొలివారంలో వేలం నిర్వహిస్తాం అని బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఇప్పటికే తెలిపింది. అయితే ఐపీఎల్‌లోని పాత ఎనిమిది జట్లు తమ ఆధీనంలో ఉన్న ఆటగాళ్ల జాబితాను ఇప్పటికే ప్రకటించాయి. మిగతా ఆటగాళ్లు అందరూ వేలంలోకి ఎంటరయ్యారు. లక్నో, అహ్మదాబాద్‌ల కొత్త జట్లు ప్రస్తుత వేలానికి ముందు చెరొక ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంటున్నది.
ఇక కేఎల్ రాహుల్, రషీద్‌ఖాన్, ఇషాన్ కిషన్‌పై ఉండగా.. అహ్మదాబాద్ జట్టు శ్రేయాస్ అయ్యర్, డేవిడ్ వార్నార్, హార్థిక్ పాండ్యాలను తమ జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు కేఎల్ రాహుల్‌ను బెంగళూరు జట్టు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు గతంలో వార్తలు వినిపించాయి. ముఖ్యంగా నూతన జట్ల అయిన అహ్మదాబాద్, లక్నో ఎవరెవరినీ ఎంచుకుంటాయో త్వరలోనే తేలనున్నది. ఇక ఎవరెవరినీ ఏయే టీమ్‌లు కొనుగోలు చేస్తాయో.. చూడాలిమరీ.