వైరల్ : క్రికెట్ లో దెబ్బకు దెబ్బ అంటే ఇదేనేమో?
లంక ప్రీమియర్ లీగ్లో పాకిస్థాన్ మాజీ పేసర్ అమీర్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయాడు. ఇకపోతే ఇటీవలే లంక ప్రీమియర్ లీగ్ లో భాగంగా గాలే గ్లాడియేటర్, జాఫ్నా కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మొదట గాలే గ్లాడియేటర్ బ్యాటింగ్ చేయగా 189 పరుగులు చేశారు. ఇక ఆ తర్వాత 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జాఫ్నా కింగ్స్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ అమీర్ వేసాడు. అయితే ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో అమీర్ వేసిన తొలిబంతిని భారీ సిక్సర్ గా మలిచాడు. తొలి బంతి సిక్సర్ పోవడంతో పాకిస్థాన్ మాజీ పేసర్ అమీర్ కోపంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే దెబ్బకు దెబ్బ తీశాడు. తర్వాతి బంతికే క్లీన్ బౌల్డ్ చేసి వికెట్లు పడగొట్టాడు అమీర్.
క్లీన్ బౌల్డ్ చేసిన సమయంలో ఆ అమీర్ కోపంతో ఊగిపోయాడు. వికెట్ కోల్పోయి నిరాశతో పెవిలియన్ వైపు వెళ్తున్న అవిష్కా ఫెర్నాండో వైపు చూస్తూ గెటవుట్ ఫ్రం ఇయర్ అంటూ కవ్వింపు లకు పాల్పడ్డాడు ఇక దీనికి సంబంధించి అంత కెమెరాలో రికార్డ్ కావడంతో దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోపై అందరూ భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు. అమీర్ నువ్వు ఎక్కడున్నా ఇలాంటి కవ్వింపు లకు పాల్పడతావా ఏంటి అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే క్లీన్ బౌల్డ్ చేసిన సమయంలో ఆ మాత్రం ఎమోషన్ ఉంటుంది అని మరికొంతమంది అమీర్ కు మద్దతుగా కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం.