గంగూలీ అలా చేసి ఉండకూడదు : దిలీప్
ఇకపోతే ఇటీవల కాలంలో ఇదే విషయంపై స్పందిస్తున్న ఎంతో మంది మాట ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే ఇటీవలే ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్ సర్కార్ స్పందించారు. వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించడం అసలు బాగాలేదు అంటు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే బిసిసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ తీరును కూడా తప్పుబట్టారు దిలీప్ వెంగ్ సర్కార్. బీసీసీఐ అధ్యక్షుడు గంగులు సెలక్షన్ కమిటీ తరఫున మాట్లాడటం అతని పని కాదు అంటూ చెప్పుకొచ్చారు. జుట్టు ఎంపిక కెప్టెన్సీ మార్పు వ్యవహారం ఎలక్షన్ కమిటీ కి చెందుతుంది అంటూ వ్యాఖ్యానించారు దిలీప్ వెంగ్ సర్కార్.
బి సి సిఐ ఈ విషయంలో ఎంతో సమర్ధవంతంగా వ్యవహరించి ఉంటే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే సౌరవ్ గంగూలీ బిసిసిఐ కెప్టెన్ మాత్రమేనని అయితే జట్టు ఎంపిక గురించి కేవలం సెలక్షన్ కమిటీ మాట్లాడాలి అంటూ దిలీప్ వెంగ్ సర్కార్ అన్నారు. కెప్టెన్ ఎంపిక తొలగింపు కూడా పూర్తిగా సెలక్షన్ కమిటీ బాధ్యత.. చైర్మన్ సౌరబ్ గంగూలీ అధికార పరిధి కాదు. ఇప్పటికైనా పరిస్థితులు మారితే బాగుంటుంది. కోహ్లీని గౌరవించాలి. విరాట్ కోహ్లీ భారత్ క్రికెట్ టీం కి ఎంతో చేశాడు దిలీప్ వెంగ్ సర్కార్ వ్యాఖ్యానించారు.