వైరల్ : లడ్డూ లాంటి క్యాచ్.. ఇలా చేశాడేంటి?

praveen
సౌతాఫ్రికాలో ప్రస్తుతం టీమిండియా జట్టు టెస్టు సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది.. ఈ క్రమంలోనే అన్ని విభాగాల్లో కూడా అద్భుతంగా రాణించడానికి టీమ్ ఇండియా తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతుంది అని చెప్పాలి.అయితే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏ చిన్న పొరపాటు చేసినా కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని కొన్ని సార్లు ఫామ్ ఉన్న బ్యాట్స్మెన్ ఇచ్చిన క్యాచ్  వదిలేసాము అంటే ఆ తర్వాత ఈ చిన్నపాటి పొరపాటే ఏకంగా జట్టు ఓటమికి కారణం అవడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది.


 ఈ క్రమంలోనే ఇలా క్రికెట్ ఆటగాళ్లు ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏదైనా చిన్న పొరపాటు చేశారు అంటే చాలు అటు సోషల్ మీడియాలో ఎంతోమంది ట్రోల్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.  సౌత్ ఆఫ్రికా గడ్డపై టీమిండియా ఆడిన తొలి టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లంచ్ బ్రేక్ వరకు వెళ్ళింది. అయితే 36 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ వికెట్  కోల్పోతాడు అని అందరూ అనుకున్నారు కానీ అదృష్టం బాగుండి చివరికి బ్రతికి పోయాడు..


 మార్కో జాన్సన్ వేసిన 17 ఓవర్ 4 బంతికి మయాంక్ అగర్వాల్ బ్యాట్ ఏడ్జ్ తాకుతూ బంతి కీపర్ వైపుగా దూసుకెళ్లింది.  అయితే కీపర్ డికాక్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు.  కానీ అంతలోనే బంతి చేతిలో నుంచి జారి పోయింది. ఇక పక్కనే ఉన్న ఎల్గర్ క్యాచ్ పట్టుకునేందుకు అవకాశం వచ్చింది. కానీ అతను కూడా వదిలేయడంతో చివరికి మయాంక్ అగర్వాల్ వికెట్ కోల్పోకుండా తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. లడ్డూ లాంటి క్యాచ్ వదిలేశాడు ఫలితం అనుభవించండి అంటూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ పెట్టాడు క్రికెట్ అభిమాని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: