వారెవ్వా అదిరే రికార్డ్.. భారత క్రికెట్ లో రెండో ఆటగాడు?
సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా మూడు టెస్ట్ మ్యాచ్ లు, మూడో వన్డే మ్యాచ్ లు ఆడబోతుంది టీమిండియా. సౌత్ ఆఫ్రికా పర్యటనలో కె.ఎల్.రాహుల్ కీలకం గా మారిపోయాడు అనే చెప్పాలి. టీమిండియా విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించడానికి కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించాల్సిందే అంటూ ఎంతో మంది సీనియర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తనపై అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటు భారీగా పరుగులు తీస్తూ అద్భుతంగా రాణిస్తున్నాడు కేఎల్ రాహుల్. ఈ క్రమంలోనే ఇటీవల సౌత్ ఆఫ్రికా లో జరుగుతున్న తొలి టెస్టులో కె.ఎల్.రాహుల్ అదరగొట్టాడు అనే చెప్పాలి.
మొదటి టెస్టు మ్యాచ్ లోనే అద్భుతమైన బ్యాటింగ్ తో భారీగా పరుగులు చేశాడు. ఏకంగా సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కుంటు సెంచరీ పూర్తిచేసుకున్నాడు కేఎల్ రాహుల్. సౌత్ ఆఫ్రికా గడ్డపై ఎంతోమంది దిగ్గజ బ్యాట్స్మెన్ లు సైతం కనీసం పాటించడానికి ఇబ్బంది పడితే కేఎల్ రాహుల్ మాత్రం ఎంతో అలవోకగా సెంచరీ పూర్తి చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇలా సౌత్ ఆఫ్రికా గడ్డపై సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా కె.ఎల్.రాహుల్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు 2007లో వసీం జాఫర్ సెంచరీ కొట్టాడు. ఇకపోతే ప్రస్తుతం కె.ఎల్.రాహుల్ సెంచరీ చేస్తే అద్భుతమైన రికార్డు తన ఖాతాలో వేసుకోవడం తో అభిమానులు అందరూ ఖుష్ అవుతున్నారు.