ఆ విషయంపై మాట్లాడి.. డబ్బులు పోగొట్టుకోను : మయాంక్

praveen
ప్రస్తుతం భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ ఆడుతుంది. అయితే సెంచరియన్ వేదికగా మొదటి మ్యాచ్ ప్రారంభమైంది. అయితే టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో భాగంగా భారత జట్టు ఎంతో నిలకడగా ఆడింది అని చెప్పాలి. ముఖ్యంగా భారత ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ లు అద్భుతంగా రాణించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే  మయాంక్ అగర్వాల్ సెంచరీ చేస్తాడు అనుకుంటున్న సమయంలో వికెట్ కోల్పోవడం మాత్రం భారత అభిమానులందరినీ కూడా ఎంతగానో నిరాశపరిచింది.



 123 బంతుల్లో 60 పరుగులు చేసి ఎంతో దూకుడుగా ఆడుతూ కనిపించాడు మయాంక్ అగర్వాల్.. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా బౌలర్ ఎంగిడి వేసిన 41 ఓవర్ రెండో బంతికి మయాంక్ అగర్వాల్ ప్యాడ్స్ తాకింది. అయితే ఆ సమయంలో సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు అప్పీల్ చేసినప్పటికీ ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్గా ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఇక ఈ ఎల్ బి డబ్ల్యు  విషయంలో సౌత్ఆఫ్రికా ఆటగాళ్లు ఎంతో కాన్ఫిడెన్స్ తో  ఉండడంతో చివరికి డిఆర్ఎస్ కు వెళ్లారు. ఈ క్రమంలోనే బాల్ ట్రాకింగ్ సమయంలో ఆ బంతి లెగ్ స్టంప్ అంచులని తాకుతున్నట్లు  కనిపించింది. ఈ విషయాన్ని  స్క్రీన్ లో చుసిన మయాంక్ అగర్వాల్ తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.


 చివరికి థర్డ్ ఎంపైర్ సూచనతో తన నిర్ణయాన్ని మార్చుకున్న ఫీల్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించారు.  ఎంతో దూకుడుగా ఆడిన టీమిండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ నిరాశతో వెనుదిరగాల్సి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మీడియా అతనన్ని ఎల్బీడబ్ల్యూ పై ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు. నిజం చెప్పాలంటే ఈ విషయం పై నా అభిప్రాయం చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే దీనిపై స్పందించి నేను మ్యాచ్ ఫీజులో కోతకు గురి కావాలి  అని అనుకోవడం లేదు. అనవసర వివాదాల్లోకి చిక్కుకోవాలని కూడా అనుకోవటం లేదు అంటూ మయాంక్ అగర్వాల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: