నాలుగేళ్ళ తర్వాత ఇండియన్ టీం లోకి... అదరగొడతాడా...

VAMSI
ఇండియన్ క్రికెట్ లో ఇప్పుడు పోటీ చాలా ఎక్కువ అయిపోయింది. దేశవాళీ స్థాయిలో తమదైన ఆటతీరుతో ఎందరో యువ ఆటగాళ్లు ఆకట్టుకుంటూ సీనియర్ ఆటగాళ్లకు చెక్ పెడుతున్నారు. అందుకే ఒకప్పుడు టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాలను అందించిన ఆటగాళ్లు సైతం కుర్రాళ్ళ పోటీకి తట్టుకోలేక జట్టులో చోటును కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదే విధంగా గత నాలుగు సంవత్సరాల క్రితం భారత్ వన్ డే జట్టులో చోటును కోల్పోయిన సీనియర్ ప్లేయర్ గత రాత్రి బీసీసీఐ ప్రకటించిన వన్ డే జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఆ ప్లేయర్ ఎవరో కాదు తమిళనాడుకు చెందిన రవిచంద్రన్ అశ్విన్. గతంలో టీంఇండియాలో మూడు ఫార్మాట్ లలో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగాడు. కానీ ఆ తర్వాత స్పిన్నర్ల ద్వయం చాహల్ మరియు కుల్దీప్ యాదవ్ లు క్లిక్ అవగానే అశ్విన్ ను సైడ్ చేసింది బీసీసీఐ. కానీ ప్రస్తుతం వారిద్దరూ ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుండా ఇటీవల వరుసగా జరిగిన టెస్ట్ లలో అశ్విన్ రాణిస్తుండడంతో బీసీసీఐ సెలెక్టర్ల చూపు అశ్విన్ పై పడింది. వన్ డే లకు కూడా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.

ఆఖరిగా అశ్విన్ 2017 లో వన్ డే మ్యాచ్ ఆడడం జరిగింది.  కాబట్టి ఇప్పుడు అందరి చూపు అశ్విన్ పైనే ఉంది. మరి సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా లేదా అన్నది తెలియాలంటే జనవరి 19 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే మూడు వన్ డే ల సిరీస్ జనవరి 19 నుండి మొదలు కానుంది. కాగా ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా మొదటి టెస్ట్ ను గెలుచుకుని సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని చేరుకుంది. ఇంకా రెండు టెస్ట్ లు మిగిలి ఉన్న నేపథ్యంలో సిరీస్ ఎవరు గెలుచుకుంటారనేది సస్పెన్స్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: