వైరల్ : అత్యంత చెత్త రివ్యూ ఇదే.. మీరే చూడండి?
న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. ఈ క్రమంలోనే ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు తో టెస్టు సిరీస్ ఆడుతుంది న్యూజిలాండ్ జట్టు. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో బంగ్లాదేశ్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. 458 పరుగులతో తొలి ఇన్నింగ్స్ను ముగించింది బంగ్లాదేశ్ జట్టు. ఆ తర్వాత బౌలర్లు కూడా విజృంభించడంతో న్యూజిలాండ్ జట్టును కట్టడి చేయగలిగింది. ఈ క్రమంలోనే ఇటీవల ఎంతో ఉత్కంఠ భరితంగా భరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో బంగ్లాదేశ్ కెప్టెన్ మొమినల్ రివ్యూ కోరిన విధానం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఇన్నింగ్స్ 37 ఓవర్లో బంగ్లాదేశ్ బౌలర్ టాస్కిన్ అహ్మద్ బోలింగ్ వేస్తున్నాడు. ఇక టాస్కిన్ వేసిన బంతిని కవర్స్ దిశగా ఆడేందుకు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ రాస్ టేలర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఎల్బిడబ్ల్యు అయినట్లుగా భావించిన బంగ్లాదేశ్ కెప్టెన్ మొమినల్ పెద్దగా అప్పీల్ చేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్గా ప్రకటించాడు. ఇక అంతటితో ఆగకుండా ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రివ్యూ కి వెళ్ళాడు బంగ్లాదేశ్ కెప్టెన్. కానీ రివ్యూ లో మాత్రం అతనికి చేదు అనుభవం ఎదురైంది. బంగ్లాదేశ్ బౌలర్ వేసిన బంతి కనీసం రాస్ టేలర్ ప్యాడ్స్ కు తగినట్లుగా కూడా కనిపించలేదు. నేరుగా వెళ్లి బ్యాట్ కు తగిలింది. అలా చెత్త రివ్యూ తీసుకుని చివరికి తీవ్ర విమర్శలు పాలు అవుతున్నాడు బంగ్లాదేశ్ కెప్టెన్ మొమినల్.