కివీస్ ను చిత్తు చేసిన బంగ్లా టైగర్స్... మరీ ఇంత దారుణమా

VAMSI
2022 కొత్త సంవత్సరంలో అందరూ ఏ క్రికెట్ సీరీస్ ఆడినా విజయంతో స్టార్ట్ చేయాలని భావిస్తారు. అయితే ఇదే కొత్త సంవత్సరంలో ఓటమి పాలైతే అది ఆ ప్లేయర్స్ ను మరియు ఆ దేశ ప్రేక్షకులను ఎంతగా బాధ పెడుతుంది అనేది చెప్పాల్సిన అవసరం లేదు. 20 - 20 ప్రపంచ కప్ లో అధ్బుతమైన ప్రదర్శన కనబరిచి తృటిలో కప్ ను చేజార్చుకున్న న్యూజిలాండ్ వెంటనే భారత్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అదే ఊపును ఇక్కడ కొనసాగించడంలో విఫలం అయింది. అలా నిరాశ తోనే సొంత గూటికి చేరుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ ల సీరీస్ కోసం కివీస్ ఆతిథ్యం ఇచ్చింది. 


జనవరి 1 నుండి ప్రారంభం అయిన ఈ టెస్ట్ లో ఒక్క మొదటి ఇన్నింగ్స్ తప్పితే మిగిలిన అన్ని ఇన్నింగ్స్ లలో, అన్ని విభాగాలలో బంగ్లాదేశ్ ఉత్తమ ప్రదర్శన కనబరిచి కొత్త సంవత్సరాన్ని విజయంతో స్టార్ట్ చేసింది.  
2021 సంవత్సరానికి టెస్ట్ ఛాంపియన్ గా అవతరించిన కివీస్ ను వారి గడ్డపైనే ఇంత దారుణంగా ఓడించడం అంటే మామూలు విషయం కాదు. న్యూజిలాండ్ రెగ్యులర్ కెప్టెన్ ఈ సీరీస్ కు దూరం కావడంతో కీపర్ బ్యాట్స్మన్ టామ్ లాతం కెప్టెన్ గా ఉన్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో 328 పరుగులు చేసి పర్వలేదనిపించినా.. బంగ్లాను నియంత్రించడంలో కివీస్ బౌలర్ ఫెయిల్ అయ్యారు.


తద్వారా బంగ్లా 458 పరుగులు చేసి... 130 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. ఇక రెండవ ఇన్నింగ్స్ లో ఎబదత్ హోస్సెన్ దెబ్బకు కివీస్ ఆటగాళ్ళు 169 పరుగులకే పిట్టల్లా రాలిపోయారు.  
బంగ్లాదేశ్ 42 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి చేదించింది. ఇది టాప్ 3 టెస్ట్ కంట్రీలలో ఒకటైన న్యూజిలాండ్ కు పరువు తక్కువ అనే చెప్పాలి. ఇక మిగిలింది ఒక్క టెస్ట్ మాత్రమే .. ఆ మ్యాచ్ లో అయినా గెలిచి సీరీస్ ను సమం చేస్తారా లేదా క్లీన్ స్వీప్ అవుతారా అనందు తెలియాలంటే రెండవ టెస్ట్ ఫలితం వచ్చే వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: