చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. తొలి విజయం?

praveen
ప్రపంచ క్రికెట్లో అంచలంచలుగా ఎదుగుతున్న బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం అద్భుత విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఎంతో పదునైన వ్యూహాలతో బరిలోకి దిగుతూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోంది బంగ్లాదేశ్ జట్టు. ముఖ్యంగా సొంతగడ్డపై అయితే వరుస విజయాలను సాధిస్తూ చరిత్ర సృష్టిస్తుంది అని చెప్పాలి. అయితే ఇటీవలే న్యూజిలాండ్ బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ జరిగింది.  ఈ క్రమంలోనే  ఇక న్యూజిలాండ్ తో కలిసి టెస్టు సిరీస్ ఆడింది బంగ్లాదేశ్ జట్టు. ఈ టెస్టు సిరీస్లో మొదటి నుంచి అద్భుతంగా రాణిస్తూ వచ్చింది అన్న విషయం తెలిసిందే. బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో కూడా అద్భుతంగా రాణించింది అని చెప్పాలి.



 దీంతో అటు ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టుకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించింది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో సంచలన విజయం సాధించింది బంగ్లాదేశ్ జట్టు. ఎనిమిది వికెట్ల తేడాతో సొంతగడ్డపైనే కివీస్ జట్టును మట్టికరిపించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా ప్రపంచ చాంపియన్ ను ఓడించి సరికొత్త చరిత్రకు నాంది పలికింది. కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. ఈ క్రమంలోనే రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్లో 1-0 తేడాతో ముందంజలో కొనసాగుతోంది బంగ్లాదేశ్ జట్టు. అయితే ఇప్పటివరకు న్యూజీలాండ్ జట్టుపై బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా విజయం సాధించిన దాఖలాలు లేవు.



 ఏ ఫార్మాట్ లో కూడా ఒక్కసారి న్యూజీలాండ్ జట్టుపై బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించలేదు. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్ పై సాధించిన తొలి విజయం ఇదే కావడంతో సరికొత్త చరిత్ర సృష్టించినట్లు అయింది. మొమినిల్ హాక్ సారథ్యంలోని జట్టు కు ఎన్నో రోజులుగా అందని ద్రాక్షల లాగా వున్న న్యూజిలాండ్ పై విజయాన్ని ఇటీవలే సాధించింది బంగ్లాదేశ్ జట్టు. దీంతో ఆటగాళ్ళు సంబరాల్లో మునిగిపోయారు అనే చెప్పాలి. ఒకవైపు బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు అద్భుతంగా రాణించడమే కాదు అటు బంగ్లాదేశ్ ఫేస్ దళం జట్టు విజయంలో కీలక పాత్ర వహించారు అని చెప్పాలి.


 తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ జట్టు 328 పరుగులకు ఆలౌట్ కాగా రెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ బౌలర్లు  విజృంభించడంతో 169 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చాప చుట్టేసింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఈ క్రమంలోనే 458 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్లో కేవలం రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు జోడించి న్యూజిలాండ్ జట్టు తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని ఛేదించింది బంగ్లాదేశ్ జట్టు. ఇలా న్యూజిలాండ్పై అలవోకగా విజయం సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక ఈ విషయంపై స్పందించి శ్రీధర్ పిల్లయి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం సాధించింది అంటూ ప్రశంసలు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: