ఏందిది.. మీ అరుపులకు గుండెపోటు వచ్చేలా ఉంది?

praveen
ప్రస్తుతం భారత్ దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు జోహన్నెస్బర్గ్ వేదికగా జరుగుతుంది. రెండవ టెస్ట్ మ్యాచ్లో అటు రెండు జట్లు కూడా ఎంతో హోరాహోరీగా తలపడుతున్నాయి  అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే సౌతాఫ్రికా గడ్డపై మొదటి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా జట్టు రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టెస్ట్ సిరీస్ కైవసం చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించాలని కసితో ఉంది. అదే సమయంలో మొదటి టెస్టు మ్యాచ్లో ఓటమి చవి చూడటం తో ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లో తప్పకుండా గెలవాలని పట్టుదలతో  సఫారీ జట్టు ఎంతో అద్భుతం పోరాటాన్ని కొనసాగిస్తోంది.


 ఇలాంటి సమయంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఎంతో రసవత్తరంగానే మారిపోయింది అన్న విషయం తెలిసిందే.అయితే మూడవ రోజు ఆటలో టీమిండియా 266 పరుగులకు ఆలౌటైంది. ఆతిథ్య  సఫారీ జట్టుకు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లో భాగంగా అటు మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య వాగ్వాదం కూడా జరుగుతూ ఉండటం గమనార్హం. ఇరు జట్లకు  సంబంధించిన ఆటగాళ్లు ఒకరిని ఒకరు కవ్వింపు లకు  దిగుతూ ఉండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆటగాళ్ళ మధ్య వాగ్వాదం జరిగిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ గా మారిపోయాయి.



  మూడవరోజు ఆటలో టీమిండియా బౌలింగ్ చేస్తున్న సందర్భంగా చోటు చేసుకున్న ఒక సన్నివేశం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండడం గమనార్హం.. దక్షిణాఫ్రికా  రెండో ఇన్నింగ్స్ లో పదవ ఓవర్ లో భాగంగా మార్కరం కు బౌలింగ్ చేస్తున్న శార్దూల్ ఠాకూర్  పదేపదే ఎల్బీడబ్ల్యు అప్పీల్ చేస్తూ గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. ఈక్రమంలోనే ఫీల్డ్ అంపైర్ గా ఉన్న మారియస్ ఎరాస్మస్ అసహనం వ్యక్తం చేశాడు. గట్టిగా ఆపిల్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు ను ఉద్దేశించి మీ అప్పీల్ కు గుండెపోటు వచ్చేలా ఉంది అంటూ లోపల గుణిగాడు.  ఇక ఈ వ్యాఖ్యలు వికెట్లకు అమర్చిన మైక్ లో రికార్డు కాగా ఇందుకు సంబంధించిన వీడియో కాస్తా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: