ఈ ఓటమికి "విరాట్ కోహ్లీ" కారణమా... అదెలా?

VAMSI
ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ లో ఇండియా ఓటమి దిశగా వెళుతోంది. నాలుగవ రోజు ఆట వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం అయినా సంగతి తెలిసిందే. అంపైర్లు సైతం ఈ రోజు కేవలం 35 ఓవర్లు మాత్రమే వేయాలని నిర్ణయించారు. 118 పరుగులు రెండు వికెట్లతో ఈ రోజు ఆటను కొనసాగించిన సౌత్ ఆఫ్రికా ధాటిగా ఇండియా బౌలర్లపై విరుచుకుపడింది. ఏ ఒక్క ఇండియా బౌలర్ కూడా డీన్ ఎల్గర్ మరియు వాండర్ డస్సెన్ లను ఇబ్బంది పెట్టలేకపోయారు అంటే ఎంత దారుణమైన బౌలింగ్ వేసుంటారో మీ ఊహకే వదిలేస్తున్నాము. కెప్టెన్ కె ఎల్ రాహుల్ కి ఇదే మొదటి టెస్ట్ కావడంతో అంత ప్రభావవంతంగా కనిపించలేదు.

బ్యాటింగ్ వరకు మొదటి ఇన్నింగ్స్ లో అర్ధ సెంచరీ మినహా గొప్పగా చేసింది ఏమీ లేదు. ఫీల్డ్ లో కూడా తన నిర్ణయాలు బాగా లేకపోవడం ఒక మైనస్ అయితే, రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఈ టెస్ట్ కు దూరం కావడంతో అనుభవం లేని రాహుల్ క్లిష్ట సమయంలో ఏ విధంగా జట్టును విజయం దిశగా నడపాలో అర్ధం అయినట్లు లేదు. దీనితో ఇండియన్ అభిమానులు అంతా మిస్ యు కోహ్లీ అంటూ విమర్శిస్తున్నారు. ఒకవేళ మాజీ కెప్టెన్ అజింక్యా రహానే ను స్టాండ్ ఇన్ కెప్టెన్ గా నియమించి ఉన్నా ఈ ఓటమి నుండి తప్పించుకునే వారే. కానీ బీసీసీఐ ఎలా చేయడానికి సాహసించలేదు.

కేవలం బ్యాటింగ్ ను ప్రమాణికంగా తీసుకుని కెప్టెన్ ను ఎంపిక చేయడం వల్ల సౌత్ ఆఫ్రికా తో రెండవ టెస్ట్ లో ఓటమి పలు కాబోతోంది. ఈ ఆత్మైని ఒక గుణపాఠంగా తీసుకుని ఇకనైనా బీసీసీఐ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఆపాలని అంతా కోరుకుంటున్నారు. మనకు అమ్ములపొదిలో అద్భుతమైన బౌలర్ లు ఉన్నా ఎవ్వరిని ఎప్పుడు వదలవు తేలియాకపోతే ఉపయోగం ఏమీ ఉండదు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఫైనల్ గా ఈ ఓటమికి రెండే రెండు కారణాలు ఒకటి కోహ్లీ టీమ్ లో లేకపోవడం మరియు కోహ్లీ కెప్టెన్ గా లేకపోవడం.  







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: