కోహ్లీకి షాక్.. అసలు పరీక్ష ఇప్పుడే?

praveen
ప్రస్తుతం కోహ్లీ సేన సౌత్ఆఫ్రికా పర్యటనలో భాగంగా ప్రోటీస్ జట్టుతో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇక ఈ టెస్టు సిరీస్లో విజయం సాధించి చరిత్ర సృష్టించడమే లక్ష్యంగా బరిలోకి దిగింది. ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్ కూడా సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ విజయం  సాధించకపోవడంతో కోహ్లీ ఆ రికార్డును సాధించింది సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయాలి అని అనుకున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ లాంటి కీలక ఆటగాడు జట్టుకు దూరమైనప్పటికీ ఎక్కడా నిరాశ చెందకుండా తనదైన వ్యూహాలతో జట్టును ముందుకు నడిపించాడు  విరాట్ కోహ్లీ. దీంతో సౌత్ ఆఫ్రికా జట్టుకు కంచుకోట లాంటి సెంచూరియన్ మైదానంలో టీమ్ ఇండియా జట్టు అద్భుతంగా రాణించింది.


 ఆతిథ్య సౌతాఫ్రికా జట్టుపై పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించి 113 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. కోహ్లీ సేన జోరు చూస్తే సిరీస్ గెలవడం ఖాయం అని ఫిక్స్ అయిపోయారు అందరూ. ఇక రెండవ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు టీమిండియాకు కలిసొచ్చే జోహన్నెస్బర్గ్ వేదిక జరిగింది. కానీ అనుకోని విధంగా టెస్టు మ్యాచ్కు ముందే కెప్టెన్ కోహ్లి వెన్నునొప్పి కారణంగా దూరం కావడంతో టీం ఇండియా కి ఎదురు దెబ్బ తగిలింది. అయితే  విరాట్ కోహ్లీ దూరమవడంతో కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి ముందుకు నడిపించాడు.  ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లో గెలుస్తుంది అనుకున్న టీమిండియా చివరికి ఓటమి చవిచూసింది.


 మొదటి మ్యాచ్లో ఓటమి పాలైన సౌత్ ఆఫ్రికా రెండో మ్యాచ్లో గెలిచి తమ సత్తా చాటింది. దీంతో మూడో టెస్ట్ మ్యాచ్లో  జట్టు లోకి అందుబాటులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లి కి అసలు పరీక్ష మొదలవుతుంది . మూడవ టెస్ట్ మ్యాచ్  ఎంత ఉత్కంఠభరితంగా ఫలితాన్ని తేల్చే మ్యాచ్ గా మారిపోయింది. దీంతో కోహ్లీ ఎలాంటి మ్యాజిక్ చేసి టీమిండియాకువిజయాన్ని అందించిన పోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. సౌత్ ఆఫ్రికా పర్యటన అటు కోహ్లీటెస్ట్ కెప్టెన్సీ సామర్థ్యానికి కూడా ఒక సవాల్ లాంటిదే అని చెప్పాలి. మరి కోహ్లీ ఇక ఈ సవాళ్లను ఎదుర్కొని పరీక్షలో నెగ్గి టెస్ట్ సిరీస్ విజయం సాధించి చరిత్ర సృష్టిస్థాడా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: