సెంచరీ మిస్.. కానీ కోహ్లీ రికార్డు కొట్టాడు?
ఇక విజేతను నిర్ణయించే మూడవ టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించి సత్తా చాటడం ఖాయం అని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే తప్పనిసరిగా విరాట్ కోహ్లీ సెంచరీ చేసి తీరుతాడు అని నమ్మకం పెట్టుకున్నారు. ఇక మూడవ టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ ఎంతో దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. ఇక విరాట్ కోహ్లీ దూకుడు చూస్తే సెంచరీ నిరీక్షణకు తెరపడటం ఖాయం అని అనుకున్నారు ప్రేక్షకులు. కాని ఫుల్ జోష్ లో ఉన్న విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 79 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు విరాట్ కోహ్లీ.
క్రీజులోకి వచ్చిన భారత బ్యాట్స్మెన్లు వరుసగా విఫలమైనప్పటికీ విరాట్ కోహ్లీ మాత్రం 79 పరుగులతో రాణించాడు అన్న విషయం తెలిసిందే. 79 పరుగులు వద్ద రబడ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ ఒక అరుదైన రికార్డును మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. రెండేళ్లుగా సెంచరీ లేని విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఆడిన టెస్టుల్లో చూసుకుంటే అత్యధిక స్కోరు 74 కావడం గమనార్హం. ఇక ఇప్పుడు సఫారీ జట్టుతో ఆడిన టెస్టు లో 79 పరుగులు చేసి అత్యధిక స్కోరు సాధించాడు. అదే సమయంలో సౌతాఫ్రికా గడ్డపై ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా కూడా కోచ్ రాహుల్ ద్రావిడ్ ను వెనక్కి నెట్టేశాడు విరాట్ కోహ్లీ.