కెప్టెన్గా నేనే సరైన వ్యక్తిని.. ఇక మీ ఇష్టం?
అలాంటి ఇంగ్లాండ్ జట్టు ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆడిన టెస్టు సిరీస్ లో ఘోరంగా పరాజయం పాలైంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ జట్టు ప్రతిష్ఠాత్మకమైన ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ ఆడింది ఇక ఈ ఐదు టెస్టుల యాషెస్ సిరీస్లో కనీసం ఆస్ట్రేలియా జట్టుకు పోటీ ఇవ్వలేకపోయింది ఇంగ్లాండ్ జట్టు. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమి చవి చూసి మరో రెండు మ్యాచ్లు మిగిలి వుండగానే సిరీస్ను కోల్పోయి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. ఒక రకంగా జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించడంలో కెప్టెన్ జో రూట్ పూర్తిగా విఫలం అయ్యాడు అని చెప్పాలి.
ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ టెస్ట్ సిరీస్ లో ఘోరంగా పరాభవం తర్వాత అటు జో రూట్ ను కెప్టెన్గా తొలగించాలి అంటూ ఎన్నో డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో జో రూట్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టు జట్టుకు కెప్టెన్గా తానే సరైన వ్యక్తిని అంటూ జో రూట్ తెలిపాడు. ఒకవేళ నా నుంచి కెప్టెన్సీ తీసుకోవాలనుకుంటే మీ ఇష్టం తీసుకోండి కానీ నేను మాత్రం కెప్టెన్గా కొనసాగాలి అని అనుకుంటున్నాను అంటూ జో రూట్ తెలిపాడు. కాగా ఇప్పటివరకు ఒక్క సారి కూడా జో రూట్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ గెలవలేదు అని చెప్పాలి.