ఐపీఎల్ వేలానికి ఆసీస్ స్టార్ ప్లేయర్ డుమ్మా... ?
మరో రెండు రోజుల్లో ఆ గడువు ముగియనుంది. కానీ ఇప్పటి వరకు కొంత మంది ప్లేయర్స్ రిజిస్టర్ చేయించుకోలేదని సమాచారం. అందులో ఆసీస్ పేస్ గన్ మిచెల్ స్టార్క్ ఒకరు. గత రెండు రోజుల క్రితమే యాషెస్ టెస్ట్ లో పాల్గొన్న మిచెల్ స్టార్క్ ఇంకా తన పేరును ఐపీఎల్ వేలంలో రిజిస్టర్ చేయించుకోకపోవడంతో, ఇతను ఐపీఎల్ 16 వ సీజన్ లో పాల్గొనడానికి ఆసక్తి ఉందా లేదా అనే కోణంలో బీసీసీఐ ఆలోచిస్తోంది. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం తీరిక లేని షెడ్యూల్ కారణంగా మిచెల్ స్టార్క్ ఈ ఐపీఎల్ కు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
స్టార్క్ మేనేజర్ కూడా ఈ విషయం గురించి ఏమీ స్పందించకపోవడం ఈ అనుమానానికి తావిస్తోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ ఐపీఎల్ లో ఆడడానికి విముఖత చూపిన విషయం తెలిసిందే. ఇందుకు మరొక కారణం కొద్ద హైలైట్ అవుతోంది. ఐపీఎల్ లో గడిపే రెండు నెలల కాలంపాటు బయో బబుల్ లో ఉండలేక కూడా చాలా మంది ఆసక్తి చూపకపోవచ్చు.