
రీసెంట్ గా కరోనా బారిన పడిన క్రికెటర్లు వీరే?
* మాజీ ఇండియన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ మరియు అతడి భార్య గీతా బస్రా లు ఇద్దరూ కరోనా బారిన పడినట్లు స్వయంగా వారే సోషల్ మీడియా వేదికగా పంచు కోవడం విశేషం. అయితే వీరికి పెద్దగా ఇబ్బంది లేదని స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్ట్ కు వెళ్ళగా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.
* ఇక ప్రస్తుతం అండర్ 19 వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఇండియా ను లీడ్ చేస్తున్న కెప్టెన్ యాష్ దుల్ మరియు వైస్ కెప్టెన్ రశీద్ లు రెండు రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు.
* ఇక పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనడానికి వెళ్లే ముందు కరోనా టెస్ట్ చేయించుకోగా పలువురు క్రికెటర్లకు నిన్న పాజిటివ్ గా నిర్దారణ అయింది. వారిలో జేమ్స్ ఫాల్క్ నర్, హెట్ మైర్, ల్యూక్ వుడ్ లు ఉన్నారు.
* అంతే కాకుండా బిగ్ బాష్ లీగ్ లో కరోనా ఎలా విజృంభించిందో మనము చూశాము. దాదాపుగా మెల్బోర్న్ స్టార్స్ ప్లేయర్స్ అంతా కరోనా బారిన పడ్డారు.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ క్రికెట్ లీగ్ లు జరుగుతుండగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రేక్షకులు, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.